- ఇందిరా పార్క్ కు తాళం
- భజరంగ్ దళ్,వీహెచ్ పీల ప్రభావం.
హైదరాబాద్ లోని ప్రముఖంగా పేరొందిన ఇందిరా పార్కు బుధవారం ఉదయం బోసిపోయింది. ఫిబ్రవరి 14..ప్రేమికుల దినోత్సవం సందర్భంగా పోలీసులు మూసివేశారు. ఉదయం కేవలం మాకింగ్ వార్నింగ్ వారికే మాత్రమే అనుమతినిచ్చారు. ప్రేమికుల దినోత్సవం జరుపుకోవద్దని..ప్రేమికులు కనిపిస్తే వివాహాలు చేస్తామని భజరంగ్ దళ్, వీహెచ్ పీ నేతలు హెచ్చరికలు చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇందిపార్కుకు భజరంగ్ దళ్ కార్యకర్తలు వస్తారనే సమాచారంతో మఫ్టీలో పోలీసులు గస్తీని నిర్వహిస్తున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రేమికుల రోజున చట్టపరిధి దాటి ప్రవర్తిస్తే చర్యలుంటాయని పోలీసులు హెచ్చరించారు.
సంజీవయ్య పార్కులో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. భజరంగ్ దళ్ హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. నగరంలోని పలు పార్కులు బోసిపోయాయి. పలు పార్కులను మూసివేసిన పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ప్రేమికుల దినోత్సవం ఇక్కడి సంస్కృతి కాదని పేర్కొంటూ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు భజరంగ్ దళ్ నేతలు ప్రయత్నాలు చేయనున్నట్లు తెలుస్తోంది. మరింత వివరాలకు వీడియో క్లిక్ చేయండి.