జనసేన ప్రచారంలో మరో ముందుడుగు వేసింది. ప్రజా పోరాట యాత్రలో భాగంగా ప్రజలతో మమేకం అవుతున్న జనసైనికులల్లో ఊపుతెచ్చేందుకు ‘రా సైనికా’ అనే వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. యువ సంగీత దర్శకుడు సాయి కార్తీక్ కంపోజ్ చేసిన ఈ సాంగ్‌కు రామజోగయ్య శాస్త్రి అదిరిపోయే లిరిక్స్ అందించారు. ఇందులో జనసేనానిగా పవన్ ప్రజల కోసం చేసిన పోరాటాలను విజువల్‌గా చూపించారు. ఉద్దాణం కిడ్నీ సమస్య, రాజధాని భూములు, ప్రత్యేక హోదా తదితర అంశాలను ప్రస్తావించారు. జనసేన పార్టీ స్థాపన నుండి ఇప్పటి వరకూ పవన్ ప్రసంగాలకు సంబంధించిన కీలక ఘట్టాలను చూపించారు. చివర్లో ‘జనసేన ప్రవాస గర్జన’ డిసెంబర్ 15న యూఎస్ఏలోని డల్లాస్‌లో నిర్వహిస్తున్నట్టు తెలిపారు.