శివ భక్తుడు అయిన టేకి నరసింహం గారు 1920 వ సంవత్సరంలో సోలాపూర్ బీజాపూర్ కి దగ్గర లో ఉన్నటువంటి పండర్ పూర్ లో పాండురంగని దర్శనం తర్వాత కలిగిన అనుభూతి తో 733 కిలోమీటర్ల దూరంలో ఉన్న మచిలీపట్నం దగ్గర ఉన్న చిలకలపూడి అనే గ్రామంలో పాండురంగ దేవాలయాన్ని 87 సంవత్సరాల క్రితం నిర్మించడం జరిగింది. ఈ దేవాలయంలో పాండురంగని తో పాటు కోటిలింగాల క్షేత్రం కూడా ప్రక్కనే ఉంది. దీనికి క్షేత్ర పాలకుడు ఆంజనేయుడు. ఆరు ఎకరాల స్థలంలో ఉన్నటువంటి ఈ పాండురంగ దేవాలయం యాగశాల, ముఖమండపం, లక్ష్మీదేవి విగ్రహం, సభా మండపం, గర్భాలయంలో దశావతారాలతో చక్కటి దైవ అనుభూతి కలిగించే ప్రదేశం. ఎంతో మంది భక్తులు వచ్చి ప్రశాంతమైన వాతావరణంలో భగవద్దర్శనం కలగజేసుకుని వెళ్లడానికి అవకాశం ఉన్న దైవ స్థలము. ప్రస్తుతం ఈ దేవాలయం పూర్వ వంశీకుల ఆధీనంలో ఉండటం వలన, కాస్తంత ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో అనుకున్నంత సదుపాయాలు భక్తులకు కలగ చేయలేక పోతున్నారు. ఈ ఆలయం మహారాష్ట్ర సాంప్రదాయం పాటించడంతో గర్భగుడిలోకి కూడా భక్తులు ప్రవేశించవచ్చు. అందువలన గర్భాలయము మిగిలిన ఆలయంలోపలి ప్రదేశాలు, అదేవిధంగా ఆలయం చుట్టూ కూడా స్వచ్ఛత గురించి రెగ్యులర్ సిబ్బంది ని నియమించాల్సి ఉంటుంది.అదేవిధంగా ఈ దేవాలయం ను ఒక మేజర్ దేవాలయం కనకదుర్గ టెంపుల్ లేదా టిటిడి వారి ఆధ్వర్యంలో దత్తత తీసుకోవడం జరగాలి. తద్వారా యాన్యువల్ మెయింటెన్స్కి కొంత సదుపాయం కలుగుతుంది. దీప ధూప నైవేద్యం పథకం క్రింద ఉన్న పూజారులకు ప్రభుత్వం ద్వారా జీతభత్యాలు లభిస్తాయి. టెంపుల్ ఖర్చు తగ్గి దానితో మెయింటనెన్స్ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ టెంపుల్ ట్రస్ట్ మరియు కమిటీల ద్వారా ఎప్పటికప్పుడు దాతలను ప్రోత్సహిస్తూ చక్కటి పరిసరాలను స్వచ్ఛతతో అలాగే దైవ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే మరింత మంది భక్తులు రావటానికి అవకాశం ఉంటుంది. టెంపుల్ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతమును ప్రస్తుతం కొంత కమర్షియల్ యాక్టివిటీకి వాడుతున్నారు. దానిని కూడా శాస్త్రీయమైన పద్ధతి ద్వారా ఆలయానికి సాలానా ఆదాయం వచ్చే విధంగా ఆలోచిస్తే ఇది మరింత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఆలయం బయట ఇసుక ఉండటం వలన కొంత స్వచ్ఛత తగ్గుతుంది. చుట్టూ చక్కటి మొక్కలను పెంచితే ముఖ్యంగా పూల మొక్కలు టెంపుల్ యొక్క సుందరీకరణ పెరుగుతుంది. కనుక టెంపుల్ అభివృద్ధికి పై పద్దతి ల లో అడుగు లు ముందుకు వేస్తే ఈ ఆలయం మరింత ప్రాచుర్యం పొందుతుంది.