అవనిగడ్డ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ కి సొంత బిల్డింగ్ లేదు. ఇది నేటికి అద్దె బిల్డింగ్ లొనే కార్యాలయ విధులు నిర్వహిస్తున్నది. అవనిగడ్డలో మార్కెట్ యార్డ్ స్థాపించవలసిన ఆవశ్యకత ఎంతో ఉంది. దీని కోసం 2003వ సంవత్సరంలో ఆర్.డి.ఓ.మచిలీపట్నం వారి కి 44లక్షల రూపాయలను మార్కెట్ కమిటీ వారు ఇచ్చి వున్నారుట కానీ నేటికీ మార్కెట్ యార్డ్ కి స్థలం కొనుగోలు చేసి యుండలేదు. రైతులు సొంత భూములు ఇచ్చేందుకు నేడు సిద్ధం గా లేరు.కారణం ప్రభుత్వ ధర కన్నా బయటి మార్కెట్ ధర చాలా ఎక్కువగావుండట వల్ల. అందువల్ల రెవెన్యూ శాఖ భూమి అవనిగడ్డలో ఉన్నవని గతంలో అనగా 2017లో రెండు ఎకరము లకు ప్రపోజల్స్ పంపి వున్నారు. అవనిగడ్డ కాంస్టుయన్సీ . ఇక్కడ మార్కెట్ యార్డ్ పూర్తి స్థాయి లో పని చేయక పోవడం రైతులకు ఇబ్బంది కలుగజేస్తుంది. పైగా ఈ ప్రాంతంలో సరైన రూరల్ గోడవునులు కూడా లేకపోవడం వలన, వచ్చిన పంట పురుల్లో దాచుకోవటం తద్వారా క్వాలిటీ తగ్గటం సరైన ధర రాక పోవడం, ఇలా అనేక రకాలుగా రైతులు మరింత ఇబ్బంది పడుతున్నారు. కావున అధికారులు పరిశీలించి తగు సాయం చేయగలరు.