YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మున్సిపల్ పనులకు జీఎస్టీ బ్రేకు

 మున్సిపల్ పనులకు జీఎస్టీ బ్రేకు
రాష్ట్రంలో మున్సిపల్ పనులకు జీఎస్టీ బ్రేకు పడింది. జీఎస్టీ అమలుపేరిట గత అగ్రిమెంట్లు అంచనాల్లో కోత విధించడంతో మున్సిపల్ కాంట్రాక్టర్లు సమ్మెబాట పట్టారు. జీఎస్టీ రేట్లు పేరిట ఇటీవల బోర్డు ఆఫ్ చీఫ్ ఇంజనీర్లు రూపొందించిన అంచనా ధరలతో తీవ్రంగా నష్టపోతున్నామని కాంట్రాక్టర్లలో ఆందోళన వ్యక్తమవుతోంది. గత ఏడాది జూలై ఒకటో తేదీ నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వేలాది ఫైళ్లు ఫెండింగ్‌లో పడ్డాయి. ఒకే దేశం ఒకే పన్ను విధానం కింద వస్తు సేవల పన్ను (జీఎస్టీ) దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. కేంద్రం అమలుచేస్తున్న ఉత్పాదన సుంకం (ఎక్సైజ్ డ్యూటీ), సేవా పన్ను (సర్వీసు టాక్సు), రాష్ట్రం అమలుచేస్తున్న విలువ ఆధారిత అమ్మకం పన్ను (వ్యాట్), కొనుగోలు పన్ను (పర్చేజి టాక్సు) తదితరాలన్నీ జీఎస్టీల్లో విలీనమయ్యాయి.గతంలో కాంట్రాక్టు విలువకు 5 శాతం వ్యాట్ చేర్చి బిల్లు చెల్లించే విధానం వుండేది. ఈ వ్యాట్‌ను ప్రభుత్వం ఆదాయంగా వెనక్కి తీసుకునేది. అంటే కాంట్రాక్టర్‌కు దక్కేది అగ్రిమెంట్ చేసుకున్న కాంట్రాక్టు విలువ మాత్రమే. అయితే ప్రస్తుతం వ్యాట్ స్థానే జిఎస్టీ రావడం వల్ల వ్యాట్‌కు బదులు 12 శాతం కాంట్రాక్టు విలువకు చేర్చి బిల్లు చేయాల్సివుందిఒకసారి అగ్రిమెంట్ అయిన తర్వాత అదే అగ్రిమెంట్‌లో పేర్కొన్న ధరలు అమలుచేయకుండా జీఎస్టీ పేరిట రూపొందించిన ధరలను 2015-16, 2016-17, 2017-18లో చేసుకున్న అగ్రిమెంట్లను పక్కనబెట్టి బోర్డు ఆఫ్ చీఫ్ ఇంజనీర్లు సిఫార్సుచేసిన ధరలంటూ అమలు చేయడంతో గత అంచనా వ్యయంలో సుమారు 12 నుంచి 14 శాతం నష్టం చవిచూడాల్సి వస్తోందని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూపొందించిన ఎస్‌ఎస్‌ఆర్ (స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్)ల్లో వ్యాట్ ఐదు శాతం కలిపేవారు. అదే ఐదు శాతాన్ని నేరుగానే కమర్షియల్ టాక్సు శాఖకు చెల్లించేవారు. ప్రస్తుతం కాంట్రాక్టు పనిపై 12 శాతం జీఎస్టీ విధించడం, ఆ 12 శాతాన్ని కాంట్రాక్టర్ చేపట్టే పని బిల్లుతో మంజూరుచేస్తామని చెబుతున్నారు. జీఎస్టీ అమలు కారణంగా సిమెంట్, ఐరన్‌పై ఇన్‌పుట్ సబ్సిడీ వస్తోందని, ఈ సబ్సిడీ కాంట్రాక్టర్‌కు వచ్చేది నాలుగు శాతం అయితే కాంట్రాక్టర్‌కు అన్ని విధాలుగా నష్టపోయేది 12 నుంచి 14 శాతం వరకు వుంటోంది. సివిల్ పనుల్లో ఉపయోగించే ముడి సరుకులైన ఇసుక తదితరాలకు జీఎస్టీ బిల్లులు వుండవు కాబట్టి ఇన్‌పుట్ సబ్సిడీ రాదు. ఇటువంటి విషయాలను పక్కనబెట్టి జీఎస్టీ పేరిట కోత విధిస్తూ ఆర్థికంగా నష్టాన్ని కలిగిస్తున్నారని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కాంట్రాక్టర్లు సమ్మె బాట పట్టారు. గతంలో చేసుకున్న అగ్రిమెంటు మొత్తంలో కోత పెట్టకుండా చూడాలని ఆందోళనకు దిగారు. ఆవిధంగా జీఎస్టీ పన్ను తిరిగి వెనక్కి ప్రభుత్వానికి చెల్లించాల్సివుంది. ఇటువంటప్పుడు కూడా కాంట్రాక్టర్‌కు అదనంగా కలిసొచ్చేదేమీలేదు, కాంట్రాక్టు విలువ తప్ప. అయితే 2017 జూన్ 30 నాటికి పూర్తయిన పనులకు వ్యాట్ ప్రకారం చెల్లింపులు జరిగాయి. అనంతరం 2017-18 అగ్రిమెంట్ ప్రకారం జిఎస్టీ అమలుతో చెల్లింపులకు ఇబ్బందేమీ లేదు. కానీ 2016-17లో అగ్రిమెంట్ చేసుకుని 2017 జూన్ 30 నాటికి వివిధ కారణాలవల్ల పూర్తికాని పనులకు మాత్రం అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. ప్రభుత్వాలు ఈ విషయంపై దృష్టిసారించాలని కోరుతున్నారు.

Related Posts