YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

హోదా ఇవ్వకపోతే ఎంపీలు రాజీనామా

 హోదా ఇవ్వకపోతే ఎంపీలు రాజీనామా

హోదా సాధిస్తేనే ఏపీకి మేలు

-  వైయస్‌ జగన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు..

- చంద్రబాబు డ్రామాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు

-  బాబును నమ్మకండి.. వైయస్‌ఆర్‌సీపీకి అండగా నిలవండి

 వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు

 రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం పదవులకు త్రుణప్రాయంగా రాజీనామాలు చేసే వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు వీరులని, బీజేపీ తిడుతున్నా..రాష్ట్ర ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలే ముఖ్యమని వేలాడుతున్న టీడీపీ నేతలు కక్కుర్తి నాయకులని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పేర్కొన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలతో రాజీనామాలు చేయించేందుకు  వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయమన్నారు. ప్రతి ఒక్కరూ వైయస్‌ జగన్‌ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారని, టీడీపీ నేతలు మాత్రం హేళనగా మాట్లాడటం వారి చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. పార్టీ ఫిరాయించి ఇంకా ఆ పదవుల్లో కొనసాగడం, బీజేపీ నేతలు తిడుతున్నా వారితోనే కొనసాగడం ఏంటని, తమ పదవులకు రాజీనామా చేసిన మేం గొప్పా..రాజీనామాలు చేయకుండా డ్రామాలు ఆడుతున్న టీడీపీ నేతలు గొప్పా అని ప్రశ్నించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో బుధవారం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.  ప్రత్యేక హోదా సాధించే దిశలో దేశమంతా ఒక్కసారి ఏపీ వైపు చూడాలని వైయస్‌ఆర్‌సీపీ గతంలో నిర్ణయించుకుందన్నారు. అవసరం, సరైన సందర్భం కోసం ఇన్నాళ్లు వేచి చూశామన్నారు. ఎంపీల రాజీనామా నిర్ణయాన్ని సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయన్నారు. కొన ఊపిరితో ఉన్న ప్రత్యేక హోదా హక్కును సాధించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చాలా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నిర్ణయాన్ని శభాష్‌ అన్నారన్నారు. అయితే చంద్రబాబు, ఆయన తాబేదారులు, కొందరు మంత్రులు, కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం ఈ నిర్ణయం మింగుడుపడటం లేదన్నారు. ఎప్పుడో చెప్పిన ఈ నిర్ణయం ఇప్పుడేందుకనీ, మరి కొందరు ఇది డ్రామా అనడం బాధాకరమన్నారు. అవగాహన లేకుండా వైయస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారని విమర్శించడం దారుణమన్నారు. 

 

డ్రామా మీదా..మాదా?

ఐదేళ్ల కోసం ఎంపీలుగా కొనసాగేందుకు ఎన్నికైన వైయస్‌ఆర్‌సీపీ సభ్యులు ఇంకా ఏడాదికి పైగా పదవిలో కొనసాగాల్సి ఉందని అంబటి రాంబాబు అన్నారు.  రాష్ట్ర ప్రయోజనాల కోసం త్రుణప్రాయంగా తమ పదవులుకు రాజీనామాలు చేసి బయటకు వస్తుంటే ఆ త్యాగాన్ని మెచ్చుకోవాల్సిన వారు కించపరిచే విధంగా మాట్లాడటం ఏపీ ప్రజలను, ప్రత్యేక హోదానే కించపరినట్లు అన్నారు. పార్టీ మారి కూడా పదవులకు రాజీనామా చేయని ఈ సమాజంలో ఇంకా ఏడాది సమయం ఉన్నా ఆ పదవులు వదిలిపెట్టేందుకు సిద్ధం కావడం డ్రామానా?. బీజేపీ నేతలు దూషిస్తున్నా.. ఇంకా కేంద్రంలో మంత్రులు పదవులు పట్టుకుని వేలాడుతున్నారని, డ్రామా ఎవరిదో ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. పార్లమెంట్‌లో ఒకరు గుండు గీయించుకుంటే, మరొకరు విచిత్ర వేషదారణ వేశారన్నారు. బంగి అనంతయ్య అనే వ్యక్తి పాత అంగీ వేసుకొని అడుకున్నారు. మరో ఎంపీ గల్ల జయదేవ్‌ ప్రదాని లేని సమయంలో గర్జించారు. ఆ గర్జనకు పార్లమెంట్‌ వణికిపోయిందట. ఆయనకు అనుకూలమైన పత్రికల్లో అహా..ఓహో అంటూ కథనాలు రాశారు. ఏం సాధించారు. ఆయన ఇంగ్లీష్‌లో మాట్లాడరట.. అసలు విషయం ఆయనకు తెలుగు రాదని ఎద్దేవా చేశారు. మమ్మల్ని డ్రామా అనే ముందుకు మీరు మీ నాటకాలు కట్టి పెట్టాలని సూచించారు. ప్రత్యేక హోదాకు సమానంగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామంటే తీసుకున్నారట. పార్లమెంట్‌ సాక్షిగా, ఎన్నికల సాక్షిగా, వెంకటేశ్వరస్వామి సాక్షిగా హామీ ఇచ్చి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. హోదా ఇవ్వకుండా ప్యాకేజీ అంటే అద్భుతం అన్నారు. ప్రత్యేక హోదా వల్ల నష్టమని ఆ రోజు టీడీపీ నేతలు ప్లెట్‌ ఫిరాయించారు. ఈ రోజు మాత్రం ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వకుండా మోసం చేశారని డ్రామాలాడుతున్నారన్నారు. 

 

వైయస్‌ జగన్‌ ఒక్కరే పోరాటం చేస్తున్నారు

ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రత్యేక హోదా కావాలని గొంతెత్తి అరిచిన వ్యక్తి ఒక్క వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మాత్రమే అని అంబటి రాంబాబు గుర్తు చేశారు.  గల్లీ నుంచి ఢిల్లీ నుంచి పోరాటాలు చేశారని, బంద్‌లు, రాస్తారోకోలు చేశారని, చివరకు ఆమరణ నిరాహార దీక్షలు చేశారని గుర్తు చేశారు. వైయస్‌ జగన్‌ చేసే పోరాటాలను మెచ్చుకోవాల్సింది పోయి హేళనగా మాట్లాడటం దుర్మార్గమన్నారు. ప్రత్యేక హోదా సాధించేందుకు ఇదో మంచి సమయం అని, వైయస్‌ జగన్‌ ఇప్పటికే ఎంపీల రాజీనామా విషయంలో నిర్ణయం తీసుకున్నారని, ఆరు కోట్ల ప్రజల కోసం చెయ్యి చెయ్యి కలిపి తోడుగా నిలవమని కోరారు. 

 

 చంద్రబాబు ఇంకా డ్రామాలు ఆడుతున్నారని, న్యాయం జరిగేంత వరకు పోరాటం ఆ గదని చెబుతున్నారన్నారు. పార్లమెట్‌ సమావేశాల నుంచి ఆజ్ఞాతంలో ఉన్నారని, మీడియాకు మాత్రం లీకులు ఇస్తున్నారని ఇదా పోరాటమని ప్రశ్నించారు. ఇది మరోక మోసమని ధ్వజమెత్తారు. రాజీనామాలు నమ్మరని చంద్రబాబు అనడం అవివేకమన్నారు. మీరు చూరు పట్టుకుని వేలాడం ప్రజలు నమ్ముతారా అని నిలదీశారు. ప్రతి రోజు బీజేపీ నేత సోము వీ్రరాజు తిడుతున్నా..అక్కడే వేలాడుతున్నారన్నారు. ప్రధాని ప్రసంగం సమయంలో ఎందుకు అడ్డుకోలేదని టీడీపీ నేతలు పేర్కొనడం సరికాదన్నారు. ఆయన ఏం చేయని పరిస్థితిలో ప్రసంగం చేస్తుంటే మేం నిరసనగా సభ నుంచి బయటకు వచ్చామన్నారు. ఇలాంటి చౌకబారు విమర్శలు మానుకోవాలని సూచించారు. ఏడాది ముందు రాజీనామా చేసిన వీరులమని, మీరు పదవుల కోసం కక్కుర్తి పడే నాయకులను విమర్శించారు. మమ్ముల్ని విమర్శ చేయడం కాదని, మా త్యాగాలను గుర్తించకపోవడం మీ దౌర్భాగ్యమన్నారు. చంద్రబాబును నమ్మకండి..త్యాగాలు చేసి ముందుకు వస్తున్న వైయస్‌ఆర్‌సీపీకి అండగా నిలవమని అన్ని వర్గాల ప్రజలను కోరుతున్నామన్నారు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకువచ్చే వరకు వైయస్‌ఆర్‌సీపీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు బుద్ది తెచ్చుకొని ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాలన్నారు. కొన్ని పేపర్లు కూడా చంద్రబాబును పొగడుతూ భలే వార్తలు రాస్తున్నారని అంబటి రాంబాబు ఖండించారు.  

Related Posts