YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం సినిమా ఆంధ్ర ప్రదేశ్

చంద్రబాబు సైంధవుడు

చంద్రబాబు సైంధవుడు
కేసీఆర్ గెలవాలని మొదటసారి దేవుడికి మెక్కాను. కేసీఆర్ గెలచినందుకు ఉదయం గుడికి వెళ్ళొచ్చాను. తెలంగాణ ప్రజలు మరోసారి వారి మానవత్వాన్ని చూపారని సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణ మురళి అన్నారు.  బుధవారం అయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలది గొప్ప మనస్తత్వం. డబ్బుల సంచులతో ఆంధ్ర నుంచి సైందవుడిలా చంద్రబాబు వచ్చాడని అయన విమర్శించారు. ఇక లగడపాటి రాజగోపాల్ సైందవ పార్ట్ - 2 గా మారాడు. గద్ధర్ లాంటి వ్యక్తి కూడా చంద్రబాబు పంచన చేరటం షాక్ అయ్యానని అన్నారు. కాళేశ్వరం ప్రాజక్ట్ పూర్తయితే సగం తెలంగాణ సస్యశ్యామలమవుతోంది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరధ గొప్ప పథకాలు. షాదీ ముభారక్, కళ్యాణ లక్ష్మీ లాంటి పథకాలు కేసీఆర్ మంచి  ఆలోచనల నుంచి వచ్చాయి. కేసీఆర్ ఫాంహౌస్ లో ఉంటాడంటోన్న చంద్రబాబు, ప్రభుత్వాధికారి  వనజాక్షిపై దాడి కన్పించలేదా అని ప్రశ్నించారు. ఆంధ్రలో కమ్మ వాళ్ళు అంటరాని వారిగా బతుకుతున్నారు. దీనికి కారణం కేవలం చంద్రబాబు మాత్రమేనని అరోపించారు. ఆంధ్రలో ప్రజలకు కమ్మ దురద ఎక్కించారు. కమ్మ వాడు అంటే నీతి, నిజాయతీ, ఇతరులకు సాయం చేసే.. కష్టపడి పనిచేసే వాడు. తెలంగాణ కమ్మ వాళ్ళు నందమూరి సుహాసినీకి ఓటు వేయలేదని అయన అన్నారు. అందుకే తెలంగాణలో ఉన్న కమ్మ వాళ్ళు టీఆర్ఎస్ కే ఓటు చేశారు. తెలంగాణలో ఉన్న కమ్మలు విజ్ఞతతో వ్యవహరించారు. సుహాసినీని చంద్రబాబు బలిపశువును చేశాడు. ఇదే విధంగా ఆంధ్ర కమ్మ వాళ్ళు రానున్న ఎన్నికల్లో వ్యవహరించాలని అన్నారు. లేకుంటే.. భవిష్యత్తుల్లో సమాజం కమ్మలను వెలివేసే పరిస్థితి వస్తోంది. జగన్ పై దాడిని చంద్రబాబు అపహాస్యం చేశారు. జగన్ కు ఉన్న ఫాలోయింగ్ చంద్రబాబుకు అస్సలే లేదని అన్నారు. భర్తలను, కొడుకులను చంపే మహిళలు చంద్రబాబు కుటుంబంలోనే ఉన్నారు. బాలకృష్ణ ఎంత మంది తాట తీశాడో సమాజానికి తెలుసని పోసాని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ పై చెప్పులు వేసినా.. చంపిన వారిని బాలకృష్ణ ఏం చేశాడో తెలియదా. ఆంధ్ర రాజకీయాల్లోకి కేసీఆర్ ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సిందేని అయన అన్నారు. పోలింగ్ కు ముందే సర్వే వివరాలు ఎందుకు చెప్పాడో లగడపాటే వివరించాలని అన్నారు. దేశంలో గొప్ప నాయకుల్లో హరీష్ రావు ఒక్కడు.  కేసీఆర్, హరీష్ , కేటీఆర్ ఎవరైనా ముఖ్యమంత్రకి అర్హులే. ఏపీలో టీఆర్ఎస్ పోటీ చేసినా.. జగన్ కే నా మద్ధతు.  లోకేష్ ప్రచారం లేయలేదు కాబట్టే తెలంగాణలో టీడీపీకి రెండు సీట్లు అయినా వచ్చాయని అయన అన్నారు. 

Related Posts