YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఉత్తరాది పార్టీగా కమలం మిగిలిపోతుందా

 ఉత్తరాది పార్టీగా కమలం మిగిలిపోతుందా
తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కారు దూసుకెళ్లింది. ప్రతిపక్షాలు వేసిన స్పీడ్ బ్రేకర్లను దాటుకొని బంపర్ విక్టరీతో మళ్లీ అధికారంలోకి వచ్చింది. టీఆర్ఎస్ ప్రభంజనం దెబ్బకు విపక్షాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. కాంగ్రెస్ మినహా పార్టీలన్నీ సింగ్ డిజిట్లకే పరిమితమయ్యాయి. ఎన్నికల్లో 119 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీకి భంగపాటు తప్పలేదు. బీజేపీ నుంచి పోటీ చేసిన హేమా హేమీలు కూడా ఓడిపోగా.. ఫలితాల్లో బీజేపీ సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. తెలంగాణలో బీజేపీకి గట్టిదెబ్బ తగిలింది. టీఆర్ఎస్ కు దీటుగా పోటీపడతామన్న కమలనాథుల ఆశలు ఫలించలేదు. 70 స్థానాలు గెలిచి అధికారంలోకి వస్తామనే ధీమా కనబరిచినా.. ఓటర్లు మాత్రం కనికరించలేదు. అదలావుంటే పోలింగ్ తర్వాత ప్రభుత్వ ఏర్పాటులో కీ రోల్ పోషిస్తామని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు చర్చానీయాంశంగా మారాయి. తీరా ఫలితాలొచ్చాక చూస్తే ఎదురుదెబ్బ తగిలింది.2014 లో 5 స్థానాల్లో గెలుపొందిన బీజేపీ ఈసారి ఓటింగ్ శాతంతో పాటు సీట్లు కూడా పెరుగుతాయని ఆశించింది. యువత బీజేపీ వైపు చూస్తుందని బలంగా నమ్మిన బీజేపీకి ఊహించని షాక్ ఎదురైంది. 70 స్థానాలతో అధికారం అని ఒకసారి, 10 సీట్లైనా గెలుస్తామని మరోసారి చెప్పిన సందర్భాలున్నాయి. తీరా చూస్తే 2014 కూడా రిపీట్ కాలేదు. అప్పటి 5 స్థానాలు కూడా రాని బీజేపీ ఈసారి కేవలం ఒకే ఒక్క సీటుతో సరిపెట్టుకోవడం గమనార్హం.తెలంగాణ అసెంబ్లీ పోరుపై భారీ ఆశలే పెట్టుకుంది బీజేపీ. అందుకే ఏ పార్టీతోనూ పొత్తుల అంశం కూడా మాట్లాడలేదు. ఒంటరిగా బరిలోకి దిగి సత్తా చాటాలని ఉవ్విళ్లూరింది. ఒకానొక సందర్భంలో అధికారం ఖాయమంటూ వ్యాఖ్యానించారు ఆ పార్టీనేతలు. మరికొన్ని సందర్భాల్లో 10 సెగ్మెంట్లలో గెలుపు మాదే అన్నారు. అయితే ఓటర్లు విలక్షణ తీర్పు ఇచ్చారు. హైదరాబాద్ గోషామహల్ నుంచి రాజాసింగ్ ఒక్కరే గెలుపొందడం ప్రాధాన్యత సంతరించుకుంది.అంబర్ పేట నుంచి ముచ్చటగా మూడోసారి  గెలుద్దామనుకున్న కిషన్ రెడ్డి ఆశలు ఫలించలేదు. ముషీరాబాద్ నుంచి కూడా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఓడిపోయారు. ఖైరతాబాద్ నుంచి చింతల రామచంద్రారెడ్డి, ఉప్పల్ నుంచి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఓటమి పాలయ్యారు. అటు కరీంనగర్ లో బండి సంజయ్ గెలుపు ఖాయమని భావించినా.. కారు హవా బ్రేకులు వేసినట్లయింది. మొత్తానికి యువత ఓట్లపై భారీగా అంచనాలు పెంచుకున్న బీజేపీకి చివరకు ఎదురుదెబ్బ మిగిలింది.బీజేపీ స్టార్ క్యాంపెయిన్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏమాత్రం పనిచేయలేదని చెప్పొచ్చు. ప్రధాని నరేంద్ర మోడీ సైతం రాష్ట్రానికి వచ్చి ప్రచారం నిర్వహించినా ఓట్లు రాలలేదు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పలు దఫాలుగా వచ్చి క్యాంపెయిన్ చేసినా నో యూజ్. ఇక ఆధ్యాత్మికవేత్త పరిపూర్ణానంద తనదైన స్ట్రాటజీ ఉపయోగించినా లాభం లేకుండా పోయింది. ఎలాంటి అవినీతికి పాల్పడబోమని పార్టీ అభ్యర్థులతో ప్రచార సభల్లో ప్రమాణం చేయించినా కూడా ఓటర్లు మొగ్గు చూపలేదు. మొత్తానికి మోడీ, అమిత్ షా చరిష్మా పనిచేయకపోవడంతో పార్టీశ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 2014 లో 5 సీట్లు గెలిస్తే.. ఇప్పుడు ఒకే ఒక్క సీటు గెలవడంతో జీఎస్టీ కోత పడిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.నోట్ల రద్దు, జీఎస్టీ అమలు లాంటి కేంద్రం నిర్ణయాలు తెలంగాణలో బీజేపీకి దెబ్బకొట్టాయని చెప్పొచ్చు. నోట్ల రద్దుపై రాత్రికి రాత్రే నిర్ణయం తీసుకోవడంతో సామాన్యులు చాలా ఇబ్బందులు పడ్డారు. తమ డబ్బులు బ్యాంకుల్లో ఉన్నా.. తీసుకోలేని పరిస్థితులు తలెత్తాయి. వాస్తవానికి నోట్ల రద్దు మంచి పరిణామమని చాలామంది భావించినప్పటికీ.. క్షేత్రస్థాయిలో సామాన్యులను ఒప్పించి మెప్పించడంలో బీజేపీ నేతలు విఫలమయ్యారనే వాదనలున్నాయి. అటు జీఎస్టీ ప్రభావం కూడా బీజేపీ ఓట్లు చీల్చిందనేది మరో కోణం.మొత్తానికి 5 స్థానాల నుంచి ఒక్క స్థానానికి పడిపోవడం నిజంగా బీజేపీకి మింగుడుపడని విషయం. బీజేపీ సోషల్ మీడియా స్టార్ అమిత్ షా బూత్ లెవెల్ నుంచి పునాదులు వేసినా ఫలితం లేకుండా పోయింది. ఇక తెలంగాణలో బీజేపీ స్టాండ్ ఏంటో.. వారి కార్యాచరణ ఏవిధంగా ఉండబోతుందో చూడాలి.119 స్థానాల్లో పోటీ చేసినా.. ఆ పార్టీకి దక్కింది ఒకే ఒక్క విజయం. అది కూడా సిట్టింగ్ సీటు. బీజేపీకి చెందిన రాజాసింగ్ గ్రేటర్ హైదరాబాద్‌లోని గోషామహల్ నుంచి గెలుపొందారు. టీఆర్ఎస్ అభ్యర్థి ప్రేమ్‌సింగ్ రాథోడ్‌పై 17వేల758 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తనను గెలవకుండా ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు తనపై నమ్మకంతో గెలిపించారని రాజాసింగ్ అంటున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ 5 స్థానాల్లో గెలించింది. ఈ సారి ఆ ఐదు స్థానాల్లో ఒక్క స్థానాన్నే నిలబెట్టుకోగలిగింది. టీఆర్ఎస్ ప్రభంజనం దెబ్బకు ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్‌తో పాటూ సీనియర్ నేతలు కిషన్ రెడ్డి, ఎన్వీఎస్ ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి వంటివారు ఓడిపోయారు. కొన్ని స్థానాల్లో బీజేపీకి డిపాజిట్లు కూడా గల్లంతయ్యాయి. దక్షిణాదిలో పాగా వేయాలని ఉవ్విళూరుతున్న బీజేపీకి నిరాశ తప్పలేదు. తెలంగాణ శాససనభ ఎన్నికల్లో అధికార పార్టీకే జనం జైకొట్టారు. టీఆర్ఎస్ పార్టీ సెంచరీకి చేరువుగా దూసుకుపోతోంది. మొత్తం 119 స్థానాలకు గానూ ఇప్పటి వరకు వెల్లడించిన ఫలితాల ప్రకారం రెండు చోట్ల విజయం సాధించి, మరో 90 సీట్లలో ఆధిక్యత కనబరుస్తోంది. కాంగ్రెస్ సారథ్యంలోని ప్రజాకూటమి కేవలం 19 స్థానాల్లోనే ఆధిక్యతలో ఉండగా, పాతబస్తీలో ఎంఐఎం తన స్థానాలను నిలబెట్టుకుంటోంది. ఇక, బీజేపీ పరిస్థితి మాత్రం ఘోరంగా మారింది. గత ఎన్నికల్లో ఐదు చోట్ల విజయం సాధించిన ఆ పార్టీకి ఇప్పుడు మాత్రం ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి కనిపించడం లేదు. బీజేపీ గెలుస్తుందని భావించిన ఖైరతాబాద్, ముషీరాబాద్, అంబర్‌పేట స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు వెనుకంజలో ఉన్నారు. బీజేపీకి కంచుకోట లాంటి అంబర్‌పేట, ముషీరాబాద్‌లోనూ కిషన్‌రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్‌లు ప్రస్తుతం ఎదురీదుతున్నారు. లెక్కింపు ప్రారంభమైన తర్వాత తొలి రౌండ్లలో ఆధిక్యతలో ఉన్నా తర్వాత మాత్రం వెనుకబడిపోయారు. ఈ స్థానాల్లో టీఆర్ఎస్, బీజేపీల మధ్య విజయం దోబూచులాడుతోంది. ప్రస్తుతం పదో రౌండ్ పూర్తయ్యేసరికి అంబర్‌పేట్‌లో కిషన్ రెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి కాలే వెంకటేశ్ 2,700పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

Related Posts