రాజకీయ పార్టీలకు ప్రజాదరణ తప్పనిసరి. ఈ ఆదరణే ఓట్ షేర్ రూపంలో కౌంట్ అవుతుంది. అయితే.. ఈ విభాగంలో బీజేపీ ఒడిదొడుకులు ఎదుర్కొంటోందా? అంటే తాజా ఎన్నికల ఫలితాలు అవుననే అంటున్నాయి. వీలైనంత త్వరగా ఓట్ షేర్ పెంచుకునే కార్యక్రమాన్ని ఉధృతం చేయాలని కమలనాథులకు సూచిస్తున్నాయి. తిరుగులేని ఆధిక్యం. ఆధిపత్యం. ఓటమెరుగని రాజకీయ పక్షం బీజేపీ లక్షణాలు. 2014 నుంచి 2017వరకూ ఏ పార్టీకి లేని అరుదైన క్వాలిటీలు కమలం సొంతం. ఇక ప్రధాని నరేంద్ర మోడీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు అయితే.. విన్నింగ్ మెషీన్. ఈ ద్వయాన్ని విజయపు యంత్రంగా ఆకాశానికెత్తేశారంతా. సొంత పార్టీయే కాదు.. మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న పార్టీలదీ అదే అభిప్రాయం. అయితే విన్నింగ్ మెషీన్ ఫార్ములాలు ఇటీవలిగా మొరాయిస్తున్నాయి. సరైన ఫలితాన్నివ్వడంలేదు. పరాజయాలూ పలకరిస్తున్నాయి. ప్రస్తుత 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా కాషాయ దళానికి చేదు అనుభవాన్నే మిగిల్చాయి. ప్రధానంగా మంచి పట్టున్న రాష్ట్రాల్లో పార్టీ పట్టు కోల్పోవడం ఆలోచించాల్సిన విషయం.
రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గడ్ బీజేపీకి కంచుకోట. ఇలాంటి చోట్ల పార్టీకి ఎదురుగాలి వీచిందంటే మామూలు విషయం కాదు. అందులోనూ 2019సార్వత్రిక ఎన్నికల ముందు ఇలాంటి ఫలితం ఆందోళనకరమే. చత్తీస్‌గడ్ లో మినహా రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ల్లో బీజేపీ సీట్ల షేర్ బాగానే ఉంది. కానీ ఓట్ షేర్ తగ్గడం గమనించాల్సిన విషయం. వచ్చే ఏడాది జరిగే జనరల్ ఎలక్షన్స్‌లో నెగ్గుకు రావాలంటే ఓట్ల శాతంపై దృష్టి పెట్టాలి. ఓట్ షేర్ మెరుగుపరచుకుంటేనే పార్టీ మంచి పర్ఫార్మెన్స్ చూపుతుంది. ఈ దిశగా కమలనాథులు ఇప్పట్నుంచే ఎక్సర్‌సైజ్ ప్రారంభించాలి.
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తీరు పరిశీలిస్తే... మూడు రాష్ట్రాల్లో కాషాయపార్టీ ఓటమి పాలైంది. రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ గెలిచింది. మిజోరంలో ఎంఎన్‌ఎఫ్‌కు ప్రజలు పట్టం కట్టారు. తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌కు తిరుగులేని విజయం అందించారు. ఇక మధ్యప్రదేశ్‌లో మాత్రం పోరు హోరాహోరీగా ఉంది. ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాలేదు. ఇదిలా ఉండగా గతంతో పోలిస్తే ఈ ఎన్నికల్లో బీజేపీ ఓటు షేరు బాగా క్షీణించింది. అయితే మొత్తంగా ఈ ఓట్లన్నీ కాంగ్రెస్‌కే వెళ్లలేదు. ఈ అంశాన్ని గుర్తించి బీజేపీ ఇప్పట్నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి.గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో ఉన్న 65 స్థానాల్లో 62 కైవసం చేసుకుంది. వచ్చే ఎన్నికల్లోనూ పైచేయి సాధించాలంటే ఆ పార్టీ కష్టపడాల్సిందే. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ గెలవాలంటే విధానాల్లో మార్పులు అవసరమని ఈ ఎన్నికలు సూచిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో ప్రస్తుతం కాంగ్రెస్ 43.2% ఓట్లు గెలుచుకుంది. 2013లో మాత్రం ఇది 40.3%. ఇక 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు లభించింది 38.37% ఓట్లు. ఇక బీజేపీ ఓటు షేరు 41% నుంచి 32.9 శాతానికి తగ్గింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ 49 శాతం ఓట్లు కొల్లగొట్టింది. ఇక బీఎస్పీ 4.3%, అజిత్ జోగీ పార్టీ 10.7% ఓట్లు గెల్చుకుంది. స్వత్రంత్రులు సైతం 6.3% ఓట్లు సంపాదించారు.
vo-
రాజస్థాన్‌లోనూ బీజేపీ ఓట్ షేర్ క్షీణించింది. 2013లోని 45.2శాతంగా ఉన్న ఓట్ల శాతం 38.8%కి తగ్గింది. లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ ఆ పార్టీ మొత్తం 25 స్థానాలనూ కైవసం చేసుకుంది. అప్పుడైతే ఏకంగా 55% ఓట్లు లభించాయి. మరోవైపు కాంగ్రెస్ ఓట్ షేర్ పెంచుకోగలిగింది. 2013లోని 33.1%గా ఉన్న ఓటు షేరును 39.2 శాతానికి చేర్చుకుంది. గత పార్లమెంటు ఎన్నికల్లో హస్తంపార్టీ రాజస్థాన్ నుంచి ఒక్క సీటునూ దక్కించుకోలేకపోయింది. అయితే ప్రస్తుతం ఆ పార్టీ ఓట్ షేర్ పెంచుకోవడంతో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మెరుగైన ప్రదర్శన చేయగలమనే భావిస్తోంది. రాష్ట్రంలో బీజేపీకి ప్రధాన విపక్షం కాంగ్రెస్సే. దీంతో హస్తంపార్టీని నిలువరించాలంటే ఓట్ షేర్ పెంచుకోవడంపై బీజేపీ సీరియస్‌గా పనిచేయాలి.మధ్యప్రదేశ్‌లో బీజేపీ ఓట్ షేర్ క్షీణత స్వల్పంగానే ఉంది. అయితే.. దీనిపై ఏమాత్రం నిర్లక్ష్యం కూడదు. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు వినూత్నంగా స్పందించారు. కాంగ్రెస్, బీజేపీల్లో ఎవరికీ విస్పష్ట ఆధిక్యత కట్టబెట్టలేదు. కాంగ్రెస్ 114సీట్లు కైవసం చేసుకుంటే బీజేపీ 109స్థానాలు దక్కించుకుంది. బీఎస్పీ 2, ఎస్పీ 1, ఇతరులు 4 స్థానాల్లో గెలుపొందారు. ఈ లెక్క పరిశీలిస్తే కాంగ్రెస్, బీజేపీల మధ్య పెద్ద వ్యత్యాసం లేదు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రభావం చూపాలంటే బీజేపీ ఇప్పట్నుంచే దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టాలి.
vo-
మధ్యప్రదేశ్‌లో బీజేపీ ఓట్ షేరు 44.9% నుంచి 41.3 శాతానికి తగ్గింది. కాంగ్రెస్ షేరు మాత్రం గణనీయంగా పెరిగింది. 2013లోని 36.4% పోలిస్తే 41.4 శాతానికి పెరిగింది. బీఎస్పీ ఓట్లు 4.6 శాతానికి పడిపోయింది. స్వత్రంత్రులు 5 శాతంతో ఉన్నారు. ఇక తెలంగాణలోనైతే కాషాయపార్టీకి 7 శాతం మాత్రమే ఓట్లు లభించాయి. మిజోరంలో ఓటు షేరు పెరగడం విశేషం. కాంగ్రెస్ ఓటు షేరు 45% నుంచి 30 శాతానికి తగ్గగా కమలం వాటా 0.4 నుంచి 8 శాతానికి పెరిగింది. తెలంగాణలో 2014 లోక్‌సభ ఎన్నికల్లో పది శాతం ఓట్లను పొందిన బీజేపీ వచ్చే ఎన్నికల నాటికి అంతకు మించిన షేర్ పెంచుకోవాలి. దానికి తగ్గ కార్యక్రమం ఇప్పుడే ప్రారంభించాలిరాజకీయ పార్టీలకు అధికారమే ఆక్సీజన్. పార్టీల మనుగడకు గెలుపు అత్యవసరం. బీజేపీకి ఈ విషయం తెలియంది కాదు. అయితే.. ప్రస్తుత ఎన్నికల ఫలితాలు పార్టీని జాగ్రత్తపడమనే చెప్తున్నాయి. ఉదాసీనత వీడి.. ప్రజలకు మరింతగా చేరువయ్యే కార్యక్రమాన్ని ఉధృతం చేయమనే సూచిస్తున్నాయి. కమలనాథులు ఈ పని ఎంత త్వరగా ప్రారంభిస్తే అంత మంచిది. 2019 ఎన్నికల్లో మరోసారి మ్యాజిక్ చేయాలంటే ఓట్ షేర్ పెంచుకునే ప్రోగ్రామ్‌ను బీజేపీ ముమ్మరం చేయాలి.