YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జిల్లాలో అత్యాధునిక సౌకర్యాలతో రైతు బజార్లు ,మార్కెట్లు. - మంత్రి నారాయణ.

జిల్లాలో అత్యాధునిక సౌకర్యాలతో రైతు బజార్లు ,మార్కెట్లు. - మంత్రి నారాయణ.
జిల్లాలోని ప్రజలకు అన్ని రకాల వస్తువులు ఒకే చోట లభించే విధంగా కొత్తగానిర్మించనున్న కూరగాయల మార్కెట్లు, రైతు బజార్లు, మాంసం ,చేపల మార్కెట్ లు ఇకపై అధునాతనంగా అన్ని సౌకర్యాలతో నిర్మించ నిర్ణయించినట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. మంగళవారం సాయంత్రం నారాయణ ఆసుపత్రి సమావేశ మందిరంలో మార్కెటింగ్ శాఖ అధికారులతో చర్చించి అనంతరం కోట మిట్ట ప్రాంతంలో మటన్ మార్కెట్ సందర్శించారు. అక్కడ నిర్మాణ పనులను పరిశీలించారు. తాను ఇచ్చిన గడువులోగా మార్కెట్ భవనం పూర్తి చేయాలని గుత్తేదారుని ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. నెల్లూరుజిల్లాలోని పొదలకూరు, నెల్లూరు, గూడూరు, వింజమూరు, నార్త్ రాజుపాలెం, వాకాడు, తదితర ప్రాంతాల్లో దాదాపు 15 రైతు బజార్లు నిర్మించాలన్న ప్రతిపాదన తో అధికారులు తనవద్దకు వచ్చారని వారితో కూడా మార్కెట్లో రైతు బజార్లు నిర్మించేందుకు అవసరమైన స్థల విషయాలు, నిర్మించబోయే మార్కెట్లు జి ప్లస్ టు పద్ధతిలో నిర్మిస్తే అందులో కూరగాయలు, మాంస పదార్థాలు, పచారీసామాన్లు, వంటి వాటికి కూడా షాపులు కేటాయిస్తామని మంత్రి తెలిపారు, ఈ విషయంపై సంబంధిత శాఖల కార్యదర్శులు, కమిషనర్లతో రెండు రోజుల్లో చర్చించి ఆధునాతన పద్ధతుల్లో మార్కెట్లో నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేందుకు కావలసిన అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు. మంత్రి వెంట మునిసిపల్ ఇంజనీరింగ్ అధికారులు, తెలుగుదేశం పార్టీ నేతలు ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి, నూనె మల్లికార్జునయాదవ్, నన్నే సాహెబ్, ప్రాంత ముస్లిం నాయకులు సమీ, తదితరులుపాల్గొన్నారు.

Related Posts