ఆస్ట్రియాలోని 'లవ్ లాక్స్ బ్రిడ్జ్' గురించి ఎప్పుడైనా విన్నారా..? ఆ బ్రిడ్జి పొడవునా ఎన్నో తాళాలు కనిపిస్తుంటాయి. వాటన్నింటినిపై కపుల్స్ పేర్లు ఉంటాయి. ఒక తాళంపై తమ జంట పేరును రాసి ఆ బ్రిడ్జ్‌పై లాక్ చేస్తే ఆ బంధం ఎప్పటికీ విడిపోదని చాలా మంది నమ్మకం. అందుకే ఆస్ర్టియాకు వెళ్లిన ఏ జంట అయినా అక్కడ తమ పేర్లతో తాళాన్ని అక్కడ లాక్ చేసి వస్తారు. ఈ నేపథ్యంలో తాజాగా మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు కూడా అక్కడ తమ పేర్లతో ఓ లాక్‌ను వేసి వచ్చారు.
దీనికి సంబంధించిన ఫొటోలను చెర్రీ, ఉపాసన తమ తమ సోషల్ మీడియాలలో అభిమానులతో పంచుకున్నారు. "టు ద మోస్ట్ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్..
హ్యాపీ వాలెంటెన్స్ డే" అంటూ చెర్రీ ఆ ఫొటోలకు కామెంట్ పెట్టగా.. "మా ప్రేమకు లాక్ చేశాం" అంటూ ఉపాసన కామెంట్ పెట్టారు.