YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌కు ఎస్పీ, బీఎస్పీల మద్దతు

మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌కు ఎస్పీ, బీఎస్పీల మద్దతు
మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీకి తాము మద్దతు ఇస్తున్నట్లు ఎస్పీ,  బీఎస్పీ ప్రకటించాయి. భాజపా అధికారంలోకి రాకుండా చేయడం కోసం కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నట్లు బీఎస్పీ అధినేత్రి మాయవతి 
తెలిపారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ మ్యాజిక్‌ ఫిగర్‌కు కేవలం ఒకే రెండు సీట్ల దూరంలో నిలిచింది. దీంతో మాయావతి మద్దతు ఇచ్చేందుకు అంగీకరించారు. ఎన్నికల 
ఫలితాలపై బుధవారం ఆమె మాట్లాడుతూ.. భాజపాను అధికారానికి దూరం చేయడమే తమ లక్ష్యమన్నారు. అందుకోసమే తాము కృషి చేస్తామని చెప్పారు. అందుకే మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నామని స్పష్టంచేశారు.230 స్థానాలున్న మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో కాంగ్రెస్ 114 చోట్ల విజయం సాధించింది. భాజపా 109, బీఎస్పీ 2, సమాజ్‌వాదీ పార్టీ ఒక చోట, ఇతరులు 4 
చోట్ల గెలుపొందారు. అధికారం చేపట్టాలంటే 116 స్థానాల మ్యాజిక్‌ ఫిగర్‌ రావాలి. కానీ కాంగ్రెస్‌కు రెండు సీట్లు తక్కువగా 114 సీట్లు లభించాయి. దీంతో కాంగ్రెస్‌ పార్టీ మాయావతి మద్దతు కోరగా 
ఆమె అంగీకరించారు. బీఎస్పీ 2 స్థానాలతో కలిపి కాంగ్రెస్‌కు 116 సీట్లు అయ్యాయి. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. కాంగ్రెస్‌కు సమాజ్‌వాదీ పార్టీ కూడా మద్దతు ఇస్తుందని ఆ పార్టీ నేత అఖిలేశ్‌ యాదవ్‌ వెల్లడించారు. ఎస్పీ సీటుతో కలిపి ఇప్పుడు కాంగ్రెస్‌ కూటమికి 117 స్థానాలు ఉన్నాయి. 

Related Posts