YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

సెన్సేషనల్ గర్ల్‌ పై పోలీస్ కేసు..

సెన్సేషనల్ గర్ల్‌ పై పోలీస్ కేసు..

గత నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో సెన్సేషనల్ గర్ల్‌గా హల్‌చల్ చేస్తున్న మలయాళ నటి ప్రియా ప్రకాశ్ వారియర్‌పై హైదరాబాద్‌లో కేసు నమోదు అయింది. ముస్లిం మనోభావాలు దెబ్బతీసేలా ప్రియా నటించారని ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్‌లో కేసును నమోదు చేశారు. ఆ పాటలోని కొన్ని మాటలు ముస్లింలకు అభ్యంతరకరంగా ఉన్నాయని.. ఆ పాటలో నటించిన ప్రియా ప్రకాష్ తమ మనోభావాలు దెబ్బతినేలా నటించిందని అందులో పేర్కొన్నారు. ఈ పాటను నిషేధించి, నటిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రియా ప్రకాష్ ఒరు ఆధార్ లవ్ అనే చిత్రంలో నటించగా.. దానికి సంబంధించిన ఓ పాట ఇటీవల విడుదలైంది. అందులో ఆమె పలికించిన హావభావాలకు కుర్రాలతో పాటు హీరోలు కూడా ఫిదా అవుతున్నారు.

Related Posts