తెలంగాణలో కాంగ్రెస్ ,టిడిపి అనైతిక పొత్తుతో ఎన్నికల్లో చిత్తయ్యారంటూ వైసిపి అధినేత జగన్ ,ఆపార్టీ నాయకులు రోజాతోపాటు మరికొంతమంది నాయకులు సాగిస్తు న్న గ్లోబల్ ప్రచారాన్ని విశాఖజిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఖండించారు. ఎస్ .రాయవరం మండలం అడ్డరోడ్డు లో ఎమ్మెల్యే అనిత మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో పోటీ చేయకుండా పారిపోయిన కోడి కత్తి పార్టీ (వైసిపి ) అధినేత జగన్, వారి అనుచరు లు ఆంద్రప్రదేశ్ లో ప్రెస్ మీట్స్ పెట్టి తెలుగుదేశం పార్టీతో పొత్తువలనే తెలంగాణలో కాంగ్రెస్ ఓడిందం టూ దుష్పచారం సాగించటం హాస్యాస్పదంగా వుందన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహ జమని,తెలంగాణలో టిఆర్ ఎస్ గెలిస్తే ఇక్కడ వైసిపి నాయకులు సంబరాలు చేసుకోవటంచూసి ప్రజలు విస్తుపోతున్నారన్నారు. జగన్ తల్లి విజయమ్మ విశాఖలో పోటీచేసి ఓడిపోయిన విషయం మరువ రాదన్నారు. అలాగే ఆనాడు ఉధ్యమ సమయంలో ఇదే టిఆర్ ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ 2009లో తమ తెలుగుదేశంపార్టీతో మహాకూటమంటూ పొత్తుపెట్టుకుని 44స్థానాల్లో పోటీచేసి 10ఎమ్మెల్యే స్థానాలు మాత్రమే గెలిచిన విషయం గుర్తుతెచ్చు కోవాలని కెసిఆర్ తోపాటు ఇప్పుడు విమర్శిస్తున్న పార్టీలను ఎమ్మెల్యే అనిత ఎద్దేవా చేసారు. 2014ఎన్నికల్లో టిడిపికి తెలంగాణలో స్వంతంగా 15 స్థానాలు వచ్చాయని,ప్రస్తుతం టిడిపినుంచి అత్యధికశాతం నాయకులు వేరేపార్టీలోకి వెళ్ళిన ప్పటికీ తెలంగాణ ప్రజలు టిడిపిని ఆదరించి ఈ ఎన్నికల్లో 2 ఎమ్మెల్యే స్థానాలను కట్టబెట్టారన్నారు.