YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపి లోఓటర్ల జాబితా అవకతవకలపై కేంద్ర ఎన్నికల సంఘానికి వైసీపీ ఫిర్యాదు

ఏపి లోఓటర్ల జాబితా అవకతవకలపై కేంద్ర ఎన్నికల సంఘానికి  వైసీపీ ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ల జాబితాలో అవకతవకలపై కేంద్ర ఎన్నికల సంఘానికి  వైసీపీ అగ్రనేతలు గురువారం  ఫిర్యాదు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరాను వైసీపీ నేతలు ఎంపీలు విజయసాయిరెడ్డి - వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి - సీనియర్ నేతలు మేకపాటి రాజమోహన్ రెడ్డి - బొత్స సత్యనారాయణ - వరప్రసాద్ - మిథున్ రెడ్డి తదితరులు కమిషనర్ కు విన్నవించారు. ఏపీలో ఓటర్ల జాబితాలో అవకతవకలతోపాటు సర్వేల పేరుతో టీడీపీ కార్యకర్తలు గ్రామాల్లోకి వెళ్లి వైసీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని కమిషనర్ కు వివరించారు. ఏపీలో టీడీపీ తొలగించిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని వైసీపీ బృందం కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు. ఓటర్ల జాబితాలో ఉన్న తప్పులను క్షుణ్ణంగా పరిశీలించి సరిదిద్దాలని కోరారు.ఎన్నికల కమిషనర్ ను కలిసిన అనంతరం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విలేకరులతో మాట్లాడారు.  ఏపీలో ఓకే వ్యక్తి పేరిట నాలుగు ఐదు ఓట్లు ఉన్నాయని.. ఇలా ఉన్న 35 లక్షల నకిలీ ఓట్లను ఆధార్ -ఓటరు గుర్తింపు కార్డుతో లింక్ చేసి తొలగించాలని కోరారు. చంద్రబాబు ప్రతి నియోజకవర్గానికి ఓట్లను నమోదు చేయించారని ఆరోపించారు. మరో 18 లక్షల మందికి ఏపీలో తెలంగాణలో రెండు చోట్ల ఓటుహక్కు ఉందని వివరించారు. ప్రజాప్రాతినిధ్యచట్టానికి సవరణలు తీసుకురావాలని ఆర్డినెస్స్ చేయాలని వైసీపీ బృందం సూచించింది.    

Related Posts