టీడీపీకి ముందు బిసిలకు ప్రాధాన్యం ఉండేది కాదు. జనాభాలో సగం ఉన్న వారికోసం బడ్జెట్ లో సగం వారికోసం ఖర్చు చేసిన సందర్భాలు గతంలో ఎన్నడూ లేవని టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు అన్నారు. జయహో బిసి పేరుతో బిసిలందర్ని ఒక వేదిక మీదకు రాజమండ్రిలో తీసుకువచ్చి వారి అవసరాలను తెలుసుకోనున్నాం. బడుగు, బలహీన వర్గాల కు టీడీపీ అందించిన ఫలాలు సక్రమంగా అందుతున్నాయి. జనాభా ప్రతిపాధికిన వారికి సంక్షేమ పధకాలు అందజేస్తున్నారు. బిసి కులాలలకు ఫెడరేషన్ లు ఏర్పాటు చేసి వారి అభివృద్దికి టీడీపీ కృషి చేస్తోంది. చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించడం ద్వారా, స్ధానిక సంస్ధల మొదలుకొని అనేక పదవులను పొందుతున్నారు. బిసిల అభ్యున్నతి కోసం రాజమండ్రిలో ఈ నెల 30న జయహో బిసి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. స్ధానిక సంస్ధల్లో 37 శాతం రిజర్వేషన్లు టీడీపి వల్ల పోందగలుగుతున్నారని అన్నారు.