అత్యాధునిక మెడికల్ పరికరాల తయారీ కంపెని ఆంధ్రా మెడిటెక్ జోన్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించి జాతికి అంకితం చేశారు. విశాఖపట్నం పెదగంట్యాడలో జరిగిన ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రపంచ అగ్ర దేశాలతో పోటీ పడుతున్న భారతదేశం ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి మెడికల్ పరికరాల తయారీ కేంద్రంను 274 ఎకరాలలో విశాఖలో నెలకోల్పింది అని అన్నారు. ఎమ్మెఆర్ ఐ, స్కానీంగ్ , ఎక్సరే వంటి అత్య ఆధునిక పరికరాలు ప్రపంచ దేశాల ఆసుపత్రిలో విశాఖ మెడిటెక్ జోన్ పరికరాలు అందుబాటులో ఉంటాయన్నారు. అలాగే
దేశంలోనే మొట్ట మొదటిసారిగా వైద్య పరికరాల తయారీ పార్క్కు సాగర తీరంలో కేంద్రం కావడం విశేషం. మెడికల్ డిస్పోజబుల్స్, వైద్య రంగంలో వినియోగించే యంత్ర పరికరాలు, సర్జికల్, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, మెడికల్ ఇంప్లాంట్స్, వ్యాధి నిర్ధారణతో పాటు ఆస్పత్రులలో వినియోగించే అన్ని రకాల పరికరాలు ఇక్కడ తయారు చేస్తారు. దేశీయంగా దాదాపు 800 వైద్య ఉపకరణాల తయారీ యూనిట్లు పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో ఉన్నాయి. అయితే.. ఖరీదైన యంత్ర పరికరాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను మాత్రం ఇప్పటికీ దిగుమతి చేసుకుంటున్నారు. దేశీయంగా వినియోగిస్తున్న పరికరాలలో 65శాతం ఇప్పటికి దిగుమతవుతున్నాయి. వీటికి పరిష్కారంగానే విశాఖ పార్క్ డెవలప్ చేసారు. అంతే కాకుండా పరికరాల టెస్టింగ్ సెంటర్ ల్యాబ్ ను ఇక్కడ నెలకోల్పడంతో అగ్ర దేశల సరసన ఇప్పుడు విశాఖ చేరింది, దాదాపుగా 2500 మందికి ఉపాధి లభించడం, 240 పైగా కంపెనీలు ఇక్కడ ఏర్పడటం విశాఖకు ప్రపంచ మ్యాఫ్ లో మరో గుర్తింపు లభించింది, ఇటువంటి పరికరాలు దిగుమతి చేసుకోవడం వలనే
పేద ప్రజలకు భారతదేశంలో వైద్యం అందుబాటులోకి రాకపోవడం ప్రధాన కారణం అని అన్నారు .