మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌కు సుప్రీంకోర్టు గురువారం నోటీసులు జారీచేసింది. తనపై పెండింగ్‌లో ఉన్న రెండు క్రిమినల్ కేసులను ఫడ్నవిస్ దాచిపెట్టారనీ... ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 2014 అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్‌లో సీఎం ఫడ్నవిస్ తనపై పెండింగ్‌లో ఉన్న చీటింగ్పరువునష్టం కేసులను వెల్లడించలేదని పిటిషనర్ ఆరోపించారు. సతీశ్ ఉకేయ్ అనే లాయర్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తున్నారు. ఇదే అంశంపైసతీశ్ ఉకేన్ దాఖలు చేసిన పిటిషన్‌ను బోంబే హైకోర్టు కొట్టేసింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సదరు న్యాయవాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం... దీనిపై సమాధానం చెప్పాల్సిందిగా ఫడ్నవిస్‌ను ఆదేశించింది. నాగ్‌పూర్ సౌత్‌వెస్ట్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఫడ్నవిస్.. శరద్ పవార్ తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టిన అతిపిన్న వయస్కుడిగా గుర్తింపు పొందారు.