YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఎరువుల ప్లాంట్ ను తనిఖీ చేసిన మంత్రి సోమిరెడ్డి

ఎరువుల ప్లాంట్ ను తనిఖీ చేసిన మంత్రి సోమిరెడ్డి
కృష్ణాజిల్లా నూజివీడు మండలం' రావిచర్ల గ్రామంలో హిమజ ఎరువుల మిక్సింగ్ ప్లాంట్ ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి  గురువారం నాడు ఆకస్మికంగా తనిఖీ చేసారు.   ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ కాపా శ్రీనివాసరావు అగ్రికల్చర్ జె.డి ఠాగూర్ నాయక్ నూజివీడు సబ్ డివిజన్ సబ్ కలెక్టర్ స్వప్నిల్  దినకరన్,  అగ్రికల్చర్ ఎ డి నిషాద్ అహ్మద్,  ఏవో భవాని పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ మిక్సింగ్ ప్లాంట్ లో ఎరువులు నాణ్యత లేకుండా రైతులకు అమ్ముతున్న కంపెనీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  నెలన్నర క్రితం గుంటూరులో ఆకస్మిక తనిఖీలు చేశాం. మైక్రో న్యూట్రిన్ విత్తనాలు ఎరువులు పురుగు మందుల శాంపిల్స్ తీసుకున్నాం.  వీటిని తనిఖీకి పంపించగా గుజరాత్ కంపెనీకి చెందిన హెచ్ టి కాటన్ విత్తనాలు నకిలివి అని తేలడంతో ఆ కంపెనీ పై యాక్షన్ తీసుకున్నామని అన్నారు. రావిచర్ల హిమజా మిక్సింగ్ ప్లాంట్ లో ఐదు రకాల శాంపిల్స్ తీసుకున్నాం. పది పన్నెండు రోజుల్లో రిజల్ట్స్ వచ్చే అవకాశముంది.  2016లో ఈ కంపెనీ పై విజిలెన్స్ రైడ్ జరిగింది క్వాలిటీ లో తేడా లేదు కానీ ప్రొడక్షన్ లో 15 -16 తేడా ఉండటం తో ఆ స్టాక్ ని సీజ్ చేయడం జరిగిందని అన్నారు. సీజ్ చేసిన ఎరువులు సుమారు 571 టన్నులు. ఇప్పుడైనా క్వాలిటీ లో తేడా వస్తే యాక్షన్ తీసుకుంటాము ఆ కంపెనీ ఆంధ్ర అయినా తెలంగాణ అయినా కర్ణాటక అయిన రాజీపడే ప్రసక్తే లేదని అయన అన్నారు. రైతులకు అన్యాయం జరిగితే ఈ ప్రభుత్వం చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటుంది. వ్యాపారం మంచిగా చేసేవారికి చిన్న చిన్న పొరపాట్లు జరిగిన వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టను. అలాగే కల్తీ చేస్తే చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటామని అన్నారు. నెలకు రెండు నెలలకు ఈ విషయంలో సమీక్షలు చేస్తూనే ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు  కూడా రైతుల విషయంలో సీరియస్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు.  డైరెక్ట్ పేమెంట్ సిస్టం ద్వారా వ్యవసాయానికి సంబంధించిన విత్తనాలు గాని ఎరువులు గాని వ్యవసాయ పనిముట్లు గాని ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకుంటే డైరెక్ట్ గా అప్లై చేసుకున్న వ్యక్తి అకౌంట్ లోకి రావడం జరుగుతుంది. ????ఈ సిస్టం  ఒక ఆంధ్రాలోనే సక్సెస్ అయ్యింది తర్వాత స్థానం తమిళనాడు ఉంది మిగతా 27 రా రాష్ట్రాలు ఈ సిస్టమ్ అమలు చెయ్యలేము అని  చేతులు ఎత్తటం జరిగిందని అన్నారు. లోటు బడ్జెట్ తో వచ్చాం. తెలంగాణ కంటే ఆంధ్రాలో రైతులకు ఎంత ఎక్కువ చేశామనే విషయంపై రెండు రోజుల్లో శ్వేత పత్రం విడుదల చేస్తానని మంత్రి వెల్లడించారు.

Related Posts