YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆంధ్రకు పొంచి ఉన్న మరో ముప్పు

ఆంధ్రకు పొంచి ఉన్న మరో ముప్పు
తిత్లీ నుంచి తేరుకుంటున్న ఆంధ్రప్రదేశ్‌కు మరో ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. ఇది ప్రస్తుతం కృష్ణా జిల్లా మచిలీపట్నంకు 1350 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ వాయుగుండం క్రమంగా బలపడి.. రాగల 24 గంటల్లో తుఫాన్‌గా మారుతుందని అంచనా వేస్తున్నారు. వాయుగుండం ప్రభావంతో కోస్తా జిల్లాలతో పాటూ ఉత్తరాంధ్రలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయంటున్నారు అధికారులు. వాయుగుండం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని అధికారులు చెబుతున్నారు. మత్స్యకారులు, తీర ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని.. గంటకు 70 నుంచి 100 మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందంటున్నారు. తీరప్రాంతంలో అలల ఉద్ధృతి పెరిగే అవకాశం ఉందని.. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. వాయుగుండం హెచ్చరికలతో ఏపీ ప్రభుత్వం కూడా అప్రమత్తమయ్యింది. ముంబై నుంచి అమరావతి చేరుకున్న సీఎం చంద్రబాబు జిల్లా అధికారులతో సమీక్ష జరిపారు. తీరప్రాంత జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. సెక్రటేరియట్‌లో ఉన్న రియల్‌టైం గవర్నెన్స్‌ కేంద్రం ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. 

Related Posts