ఉత్తర్‌ప్రదేశ్ బీఎస్పీ ఎమ్మెల్యే ముఖ్తార్ అన్సారీ లక్నోలోని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయి బాందా జైలుకు తిరిగి వచ్చారు. జనవరి 9న ఆయనకు గుండెపోటు రాగా జైలు అధికారులు ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యం కుదుటపడడంతో గత రాత్రి ఆస్పత్రి నుంచి పంపించారని, గట్టి బందోబస్తు మధ్య జైలుకు తిరిగి తీసుకొచ్చారని జైలర్ వివేక్‌షీల్ శుక్రవారం తెలిపారు. 55 సంవత్సరాల అన్సారీపై అనేక క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయని, జైలులో తన భార్యను కలుసుకున్నాక గుండెపోటుకు గురయ్యారన్నారు. గ్యాంగ్‌స్టర్ అయిన అన్సారీ మవు నియోజకవర్గం నుంచి గెలుపొందారని, 2015 నుంచి రాష్ట్రంలోని వివిధ జైళ్లలో ఉన్నారని పోలీసులు తెలిపారు.