YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

కేసీఆర్ టార్గెట్ బాబు.. ఇమేజ్ డామేజ్ పనిలో గులాబీ దళపతి

కేసీఆర్ టార్గెట్ బాబు.. ఇమేజ్ డామేజ్ పనిలో గులాబీ దళపతి
ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడం మొదలు పెట్టేశారు. కాంగ్రెస్ పక్షాన వుండే మిత్రపక్షాలను ఒక్కరొక్కరుగా టి ఎన్నికల ముందే లాగుతున్నారు చంద్రబాబు. రాహుల్ గాంధీ తో కలిసి టి ఎన్నికలను హీట్ ఎక్కించారు బాబు. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు పూర్తిగా బిజీ అయిపోయారు. దీనికి అడ్డుకట్ట వేసే చక్రమే కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్. తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నికలు పూర్తి కావడంతో ఇప్పుడు స్వేచ్ఛగా జాతీయ రాజకీయాల్లో స్పీడ్ కానున్నారు గులాబీ బాస్. ఇప్పటివరకు జాతీయ రాజకీయాల్లో టాప్ లో వున్న చంద్రబాబు ఇప్పుడు ఎపి రాజకీయాలపై ఎక్కువ సమయం కేటాయించక తప్పదు. కెసిఆర్ మాత్రం ఫెడరల్ ఫ్రంట్ నిర్మాణం జాతీయ స్థాయిలో పార్టీ పెట్టేందుకు వీలైనమత తీరిక లభించడంతో చంద్రబాబు కు తెలుగు రాష్ట్రాల్లోనే పట్టు లేదంటు జాతీయ స్థాయిలో బాబు ఇమేజ్ డ్యామేజ్ చేసే పనిలో గులాబీ బాస్ బిజీ కానున్నారు. అదే ఇప్పుడు టిడిపి కి ఆందోళన కలిగిస్తుంది. మరి ఏ చంద్రుడు జాతీయ రాజకీయాల్లో ప్రకాశిస్తారో వేచి చూడాలి.తెలంగాణ లో ఎన్నికలు పూర్తి అయిపోయాయి. దాంతో కెసిఆర్ మంచి జోష్ మీద జోరు మీద వున్నారు. కొంత కాలం క్రితం ఫెడరల్ ఫ్రంట్ మొదలు పెట్టారు కెసిఆర్. దీని లక్ష్యం అటు బిజెపి ఇటు కాంగ్రెస్ లేని కేంద్ర ప్రభుత్వం రావాలి.దశాబ్దాల పాటు అధికారాన్ని పంచుకున్న కాంగ్రెస్, బిజెపిలు దేశంలో అనేక కీలక సమస్యలను పరిష్కరించడంలో విఫలం అయ్యాయి అన్నది కెసిఆర్ వాదన. ఈ రెండు ప్రధాన రాజకీయ పార్టీలు కాదని దేశ వ్యాప్తంగా వున్న ప్రాంతీయ పార్టీలన్నిటిని కలుపుకుని ఫెడరల్ ఫ్రంట్ కి శ్రీకారం చుట్టారు గులాబీ బాస్. దాంతో ఆ ఫ్రంట్ యాక్టివిటీ మొదలు అయ్యింది. తెలంగాణ ఎన్నికలకు ముందు దేశంలోని ప్రాంతీయ పార్టీల అధినేతలను కలిసివచ్చారు కేసీఆర్. ఆయన తరువాత చంద్రబాబు స్కూల్ స్టార్ట్ చేశారు. ఇద్దరు చంద్రులు జాతీయ రాజకీయాల్లో క్రీయాశీలకం అయిపోయారు.

Related Posts