మూడు రోజులుగా వైసీపీ, బీజేపీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాయి. ముంపు మండలాలు, సీలేరు , బలిమెల ప్రాజెక్ట్ విషయంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన కేసీఆర్ కోసం టపాకాయ లు కాలుస్తారా అని మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ప్రశ్నించారు. శుక్రవారం అయన మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చినవుడు వైసీపీ ఎంపీలు ఎక్కడ ఉన్నారు. పోలవరం మీద కేసు లు వేసిన వారితో జగన్ చేతులు కలిపాడు. పార్లమెంట్ లో విజయసాయి ప్రశ్నలు వేసి, ఆ సమాచారం పొరుగు రాష్ట్రానికి ఇస్తున్నారని అన్నారు. వైఎస్ హయాంలో కంటే మెరుగైన పరిహారం పోలవరం నిర్వాసితులకు లభిస్తుంది. పట్టిసీమ నుంచి 260టీఎంసీ ల నీరు వస్తే జగన్ కు కనిపించడం లేదు. పులివెందుల లో పరుగెడుతున్న కృష్ణ జలాల వల్ల వెయ్యి కోట్ల ఆదాయం లభించినా బుద్ది రావడం లేదని విమర్శించారు. తెలంగాణలో గెలిచిన వైసీపీ పార్టీ సభ్యుల్ని కేసీఆర్ కి భయపడి టీ ఆర్ ఎస్ కి అప్పగించేసాడు. తెలంగాణలో పోటీ చేయడానికి కూడా భయపడి, లాలూచీ రాజకీయాలు చేస్తున్నారు. కుహనా మేధావులు అసెంబ్లీకి రాని జగన్ ని సమర్థిస్తూ, సేవ్ డెమోక్రసీ అని మాట్లాడుతున్నారు. జగన్ శాసనసభ ఎందుకు ఎగ్గొట్టాడో మేధావులు ప్రశ్నించాలని అయన అన్నారు.