సీమాంధ్ర నాయకులను పంచాలూడకొట్టి తరమాలి అన్న తెరాస గెలిస్తే సంబరాలు చేసుకున్న వైస్సార్ పార్టీ నాయకులు ఆంధ్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసి రెడ్డి అన్నారు. శుక్రవారం నాడు అయన మీడియాతో మాట్లాడారు. మేము మలమూత్రాలు విసర్జించిన నీటిని మీరు వినియోగిస్తున్నారు అన్న కే సీ ఆర్ విజయన్ని మీరు సంబరాలు ఎలా చేసుకుంటారని అయన ప్రశ్నించారు. ప్రత్యేకహోదా కు వ్యతిరేకంగా మాట్లాడిన కేసీఆర్ మీరూ ఎలా సమర్ధిస్తారని నిలదీసారు. టీఆర్ఎస్ గెలిస్తే వైసీపీ పైశాచికానందం ఏపీ ప్రజలను అవమానించడమే అని అన్నారు. టీఆర్ఎస్ నిర్మిస్తోన్నఅక్రమ ప్రాజెక్టుల వల్ల ఏపీ ఎడారిగా మారుతోందని విమర్శించారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు తాము ఏ పార్టీతోనైనా పొత్తుకు సిద్ధమని స్పష్టం చేశారు.ఒక రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ పొత్తుపై అధిష్ఠానానిదే తుది నిర్ణయమని అయన అన్నారు.