YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పొత్తు వుండదు.. ఒంటరిగానే వైకాపా పోటీ

పొత్తు వుండదు.. ఒంటరిగానే వైకాపా పోటీ
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రానున్న ఎన్నికలలో ఎవ్వరితో పొత్తు లేకుండా పోటీచేస్తుంది. ఈ విషయాన్ని మా అధినేత పలుమార్లు స్పష్టం చేశారని వైకాపా నేత బోత్స సత్యనారాయణ అన్నారు. శుక్రవారం అయన మీడియాతో మాట్లడారు. ఎన్నికలలో టిఆర్ ఎస్ ను దెబ్బతీసేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. దానికిప్రతిగా కేసిఆర్ వచ్చి ఇక్కడ ఆయనను దెబ్బతీసే ప్రయత్నం చేస్తారు. ఇందులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంభందం ఉంటుంది. ఎవరో సంబరాలు జరుపుకుంటే దానిని మా పార్టీకి అంటగట్టడం ఏంటని అయన ప్రశ్నించారు. చంద్రబాబు ఊసరవెల్లి మాటలపై ఆలోచించాలని చెబుతున్నా. చంద్రబాబు హరికృష్ణ చనిపోయిన సందర్భంలో టిఆర్ ఎస్ తో పొత్తుకు ప్రయత్నించిన విషయం వాస్తవం కాదా అని నిలదీసారు. ఈ విషయాన్ని స్వయంగా కేటిఆర్ ప్రకటించారు. ఆరోజు కేటిఆర్ ఒప్పుకుని ఉంటే  హోదా వద్దని చెప్పిన టిఆర్ ఎస్ తో పొత్తు మంచిదవుతుందా? పరిటాల శ్రీరామ్  వివాహ సందర్బంలో అటు చంద్రబాబు ఇటు కేసిఆర్ తో కూడిన కటౌట్లు వేసింది ప్రజలు మరిచిపోలేదని అయన గుర్తు చేసారు. రాష్ర్టాన్ని చంద్రబాబు ఎంత భ్రష్టుపట్టించారో...కేసిఆర్ అంత నష్టపరిచారు. ఓటుకునోటు కేసులో మీరుఇద్దరు రాజీపడకపోతే ఇంతగా నష్టం జరిగిఉండేది కాదు. కేసిఆర్ యాగం చేస్తుంటే పిలవగానే ఎగేసుకుంటూ చంద్రబాబు స్వయంగా హాజరవుతారు. కేసిఆర్ ను రాజధాని నిర్మాణ శంఖుస్దాపనకు పిలుస్తారు. ఇప్పుడేమో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కి అంటగట్టి మాట్లాడతారా అని అన్నారు. నిన్నటి వరకు బిజేపితో, పవన్ తో కలసిపోయారని దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇప్పుడు చూస్తే కేసిఆర్ తో అంటగట్టే ప్రయత్నం చంద్రబాబు మాయమాటలు నమ్మోద్దని ప్రజలకు చెబుతున్నామని అన్నారు. లగడపాటి రాజగోపాల్ సర్వేలు చేస్తారని ఉండేది.కాని ఈసారి సర్వేపేరుతో తెలంగాణా ఎన్నికలలో ప్రజలను నట్టేట ముంచారని విమర్శించారు. ఇది చంద్రబాబు నాయుడు కుట్రా?.లేకపోతే బెట్టింగ్ ల కోసం లోకేష్ తో కలసి ఇలాంటి వాటికి పాల్పడ్డారా అని అనిపిస్తోంది. ఆయన ఆర్దికలావాదేవీలనుంచి బయటపడేయాలనే చేసిిన కుట్రా? అని కూడా తెలియాలి. లగడపాటి,తెలుగుదేశంను టిఆర్ ఎస్ ను కలసి .వైయస్సార్ కాంగ్రెస్ ఉనికి లేకుండా చూద్దామనే కుట్ర చేశారు. దేవుడు ఉన్నాడు.దేవుడు చూస్తుంటాడు.అందుకే ఈ ఫలితాలని అన్నారు. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడిన మాటలు ఖండిస్తున్నాం.  దేశంలో మూడు రాష్ర్టాల్లో కాంగ్రెస్  గెలవడానికి ఆయన  చేసిన కృషే కారణం అన్నాడు.ఈ మాటలు చూస్తే నవ్వోస్తుంది. ఆయన తాలూకా ఆలోచన ఏ విధంగా ఉందో దేన్ని, దేనికి ముడిపెడుతున్నారో చూడండని అన్నారు. తెలంగాణా ఫలితాలు రాగానే 2.30 గంటలకు మొదట లోకేష్ మరికొద్దిసేపటికి చంద్రబాబు అభినందనలు తెలిపారు. అదేమంటే సంప్రదాయం అంటారు.అదే జగన్ గారు సాయంత్రం పూర్తి ఫలితాలు వచ్చాక అభినందించారు. ఏపికి చంద్రబాబు చేసిన ఒక్క పని చెప్పండి.ఎంతసేపటికి లాలూచి రాజకీయాలు నడిపి తిరిగి సిఎం అవ్వాలనే ధ్యాస తప్పని అరోపించారు. తెలుగుప్రజలందరూ కలసి ఉండాలి.సోదరభావంతో ఉండాలి.  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి  పార్టీ ప్రయోజనాలకంటే ఆంధ్రరాష్ర్ట ప్రయోజనాలే మాకు ముఖ్యం. ఈ విషయంలో పక్క రాష్ర్టంతోనే కాదు ఎవరితోనైనా రాజీపడేప్రశ్నలేదు.చంద్రబాబుకు మాత్రం పార్టీ స్వప్రయోజనాలే ముఖ్యమని అన్నారు. తెలుగుదేశం నేతలు ,చంద్రబాబు పరిపక్వతతో ఆలోచించండి. అసలు రాష్ర్టాన్ని ఎటు తీసుకువెళ్దాం అనుకుంటున్నారు ఇకనుంచైనా సరైన రీతిలో పాలన చేయండి. లగడపాటి లాంటి వారు లావాదేవీలు ఉంటే తర్వాత చూసుకోవచ్చు.తెలుగువారి మధ్య అగాధాలు పెంచవద్దని సూచించారు. బెట్టింగ్ ల వల్ల ఎన్నో కుటుంబాలు నష్టపోయాయి.ఇలాంటి వాటిని కట్టిపెట్టండి మరోసారి సర్వేల పేరుతో ప్రజలను మోసం చేయద్దని అన్నారు. 

Related Posts