‘మై ఎమ్మెల్యే-రోజా సెల్వమణి’ పేరుతో ఎమ్మెల్యే ఆర్కే రోజా ఈరోజు మొబైల్ యాప్ ను ఆవిష్కరించారు. ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకే యాప్ ను తీసుకొచ్చామన్నారు. అలాగే నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ యాప్ ద్వారా తనకు ఫిర్యాదు చేయవచ్చని వెల్లడించారు. దీని ద్వారా అపాయింట్ మెంట్ కూడా తీసుకోవచ్చని పేర్కొన్నారు. టీడీపీ నేతలు ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటూ ఉంటే తాము మాత్రం ప్రజలకు లబ్ధి చేకూర్చే దిశగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.