కాంగ్రెస్ రాహుల్ గాంధీ కి చెంపపెట్టు లాంటి తీర్పును రఫెల్ డీల్ పై సుప్రీంకోర్టు ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పుతోనైన కాంగ్రెస్ పార్టీకి కనువిప్పు కలగాలి. అవినీతి,కుంభకోణలకు పాల్పడిన చరిత్ర కాంగ్రెస్ దే నని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మన్ అన్నారు. భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నాలుగున్నర ఏళ్లలో అవినీతి మచ్చపడకుండా పారదర్శకంగా పాలన కొనసాగిస్తుంది. అధికారం కోసం తప్పుడు ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తమ తప్పును ఒప్పుకొని ముక్కు నేలకురాసి క్షమాపణలు చెప్పాలని అన్నారు. గురువారం జరిగిన పదాధికారుల సమావేశంలో 2019 ఎన్నికల్లో విజయం సాధించడం పై చర్చ జరిగింది. 2019 ఎన్నికలు పూర్తయ్యేవరకు విరామం లేకుండా భాజపా అనుబంధ సంస్థలన్నీ, మోర్చామలన్నీ ప్రజలతో మమేకం అవ్వాలని జాతీయ అధ్యక్షుడు పిలుపునిచ్చారని అయన అన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అమిత్ షా సూచించారు. డిసెంబర్ 24 న తెలంగాణ లో అమిత్ షా పర్యటన ఉంటుంది. డిసెంబర్ చివరి వారం లేదా జనవరి మొదటి వారంలో ప్రధాని మోదీ కూడా తెలంగాణలో పర్యటిస్తారు. పార్టీ బలోపేతం,ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడం పై దృష్టిపెట్టబోతున్నాంమని అన్నారు. తెరాస అధికార దుర్వినియోగానికి పాల్పడింది. చంద్రబాబు పర్యటనతో తెలంగాణ వ్యతిరేకులకు, తెలంగాణ వాదులకు మధ్య పొరుగా ప్రజలు భావించి ప్రజలంతా తెరాస పక్షాన నిలిచారు. ఈవీఎంలు టాంపరింగ్ జరిగిందనే అనుమానం ఉంది. పోలైన ఓట్లకు ,లెక్కించిన ఓట్ల మధ్య వ్యత్యాసం ఉంది. లక్షల సంఖ్యలో ఓట్ల గల్లంతు అయ్యాయి.వీటిపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని అయన అన్నారు.