YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రాంకో సిమెంట్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు

 రాంకో సిమెంట్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు

కర్నూలు  జిల్లాలో రాంకో సిమెంట్ ఫ్యాక్టరీకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. శుక్రవారం ఉదయం ఉండవల్లి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాంకో ఫ్యాక్టరీకి సీఎం శంకుస్థాపన చేశారు. 14 మాసాలలో పరిశ్రమను ఏర్పాటుచేసి 2020 ఫిబ్రవరి నాటికి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని రామ్కో యాజమాన్యానికి  ముఖ్యమంత్రి నిర్దేశించారు.  తరువాత  స్థానిక రైతులతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  ముఖాముఖి నిర్వహించారు. చంద్రబాబు మాట్లాడుతూ  ఉద్యాన పంటల్లో రాయలసీమ ఇప్పటికే దేశానికి తలమానికంగా ఉంది. కియా రాకతో ఆటోమొబైల్ రంగంలో రూ.20 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని  అన్నారు. రాష్ట్రానికి ఏమొచ్చాయని అడిగే విపక్షం ఇవన్నీ చూసి మాట్లాడాలి, కర్నూలు జిల్లాలో 15 యూనిట్లు ఉత్పత్తిదశలో ఉన్నాయి. రాష్ట్రాభివృద్ధిని ఒక యజ్ఞంలా చేస్తుంటే కొంతమంది అదేపనిగా అడ్డు పడాలని చూస్తున్నారు. రాజధాని నిర్మాణానికి డబ్బులివ్వకపోయినా సొంతంగా నిధులు సమకూర్చుకునే మార్గాల్ని అన్వేషిస్తూ రూ.50 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం సక్రమంగా నిధులు సమకూర్చకపోయినా పనులు నిరాటంకంగా కొనసాగిస్తున్నాం. కర్నూలు జిల్లాకు పుష్కలంగా సాగునీరు అందుతోందంటే అది వర్షాల వల్ల వచ్చిన నీరు కాదు, గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు పారించి కృష్ణా నీటిని సీమ జిల్లాలకు తరలించడం వల్లనే పొలాలు తడపగలుగుతున్నామని అన్నారు. 

Related Posts