జిల్లాలోని పూతలపట్టు మండలం పి కొత్తకోట వద్ద గోకుల్ మిల్క్ డెయిరీని పరిశ్రమల శాఖ మంత్రి ఎన్ అమరనాథ్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. 50 వేల లీటర్ల మిల్క్ ప్రాసెసింగ్ సామర్థ్యం కలిగిన గోకుల్ యూనిట్ తో చుట్టుపక్కల ఉన్న పాల ఉత్పత్తిదారులు లబ్దిపొందనున్నారు. మంత్రి మాట్లాడుతూ రాబోయే కాలంలో ప్రాసెసింగ్ కు అధిక డిమాండ్ ఉంటుంది. చిత్తూరు జిల్లాలో ప్రాసెసింగ్ కు మంచి అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో పాల ఉత్పత్తి చిత్తూరు జిల్లాలోనే అధికంగా ఉందని అన్నారు. బెంగుళూరు, చెన్నై నగరాలు జిల్లాకు సమీపంలో ఉండడం కలిసివచ్చే అంశం. పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపించే ఔత్సాహికులకు రాయితీలు ఇచ్చి ప్రోత్సాహిస్తున్నాం. దీని కోసం ముఖ్యమంత్రి ప్రత్యేకంగా 2015-20 పాలసీని ప్రవేశపెట్టారని అన్నారు. పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు దేశంలోనే ఎక్కువ రాయితీలు ఇస్తున్న రాష్ట్రం ఏపినే. ఏ ప్రభుత్వం ఇవ్వనట్టుగా రాయితీలను పారదర్శకంగా అందిస్తున్నామని మంత్రి అన్నారు.