YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

లేని కుంభకోణాన్ని సృష్టించారు

లేని కుంభకోణాన్ని సృష్టించారు
రఫెల్ విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు తో తేటతెల్లమైంది. కుటుంబరావు పెద్ద స్కాం బయటపెడతానని చెప్పి, లేని కుంభకోణాన్ని సృష్టించారు. తెలుగుదేశం డ్రామా కంపెనీ ఒక గాలి కంపెనీ ని ప్రజలు పట్టించుకునే పరిస్థితి లో లేరని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ అన్నారు.  ఆకాశం మీద ఉమ్మేస్తే తిరిగి మన మీద పడుతుందని గుర్చించలేకపోయారు. గాలి కంపెనీ డ్రామా కంపెనీ డైరెక్టర్ చంద్రబాబునాయుడు. ఇకముందు ఇలాంటి స్టోరీలు తయారు చేయడానికి రెడీగా ఉన్నారు. ఏనుగులు పోతుంటే కుక్కలు మొరుగుతూ ఉంటాయి.దేశ ప్రజలు గుర్తుపెట్టుకోవాలని అయన వ్యాఖ్యానించారు. దేశంలో దొంగలు పడ్డారు,కొందరు బురద లో పొల్లాడి వాళ్లకు అంటిన బురద ను మోడీకి అంటించాలని చూస్తున్నారు. తెలుగు డ్రామా కంపెనీ దొంగ చంద్రబాబు నాయుడు దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి .ఎందుకంటే ఈ స్టోరీ తయారు చేసింది చంద్రబాబునాయుడే. చంద్రబాబు తో కాంగ్రెస్ పార్టీ స్నేహం చేస్తే తెలంగాణలో చేతులు కాలినట్లు మళ్ళీ కాల్చుకుంటారని అయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు పట్ల జాగ్రత్తగా ఉండాలి. కాపు రిజర్వేషన్, వాల్మీకి బోయల రిజర్వేషన్లు గురించి రాజనాథ్ సింగ్, ఓరం లతో కలసి మాట్లాడాం. చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని కులాలను మోసం చేశారని కేంద్ర మంత్రులకు వివరించాం. త్వరలో వాల్మీకి బోయల విషయం పై జోయల్ ఓరం చర్చిద్దాం అని హామీ ఇచ్చారని అయన అన్నారు. 

Related Posts