కొత్త బంగారు లోకం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన శ్వేతా బసు ప్రసాద్ పెళ్లి పీటలెక్కింది. ప్రముఖ ఫిల్మ్ మేకర్ రోహిత్ మిట్టల్‌ను వివాహ మాడింది. గురువారం రాత్రి పుణెలో కుటుంబ సభ్యులు, స్నేహితులు సమక్షంగా వీరి వివాహం ఘనంగా జరిగింది. బెంగాలీ సంప్రదాయంలో జరిగిన ఈ వివాహ వేడుక ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు శ్వేతా బసు. గత కొంతగాలంగా రోహిత్ మిట్టల్‌తో ప్రేమయణం కొనసాగిస్తున్న శ్వేతా బసు తమ పెళ్లి విషయాన్ని ఇది వరకే ఇన్ స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది. రీసెంట్‌గా తన పెళ్లికి సంబంధించిన బ్యాచ్‌లర్స్ పార్టీ కూడా ఇచ్చింది శ్వేతా బసు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా.. ‘మక్డే’ చిత్రంతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన శ్వేతా బసు.. పలు హిందీ చిత్రాలతో పాటు.. తెలుగు, తమిళ భాషల్లో నటించింది. ‘కొత్త బంగారు లోకం’ చిత్రంతో ఎకాడా.. అనే డైలాగ్‌తో పాపులర్ అయిన ఈ భామ తొలి చిత్రంతోటే హిట్ అందుకుంది. అనంతరం రైడ్, కల్వర్, కింగ్, కాస్కో తదితర చిత్రాల్లో నటించి తెరమరుగైంది. అప్పట్లో ఆమె పేరు ఓ కేసులో మారు మోగినా ఆ కేసు నుండి క్లీన్‌చీట్ తెచ్చుకుంది. ప్రస్తుతం సినిమాలకు దూరమైన ఈ బొద్దుగుమ్మ టీవీ సీరియల్స్‌లో బిజీగా ఉంది.