పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో తెలుగు క్రికెటర్ హనుమ విహారి కెప్టెన్ విరాట్ కోహ్లీ నమ్మకాన్ని నిలబెట్టాడు. ఈరోజు ఆరంభమైన ఈ టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ హారిస్ (70: 141 బంతుల్లో 10x4) వికెట్ తీసేందుకు నలుగురు ఫాస్ట్ బౌలర్లు నాలుగు గంటలు పాటు తీవ్రంగా ఇబ్బంది పడిన వేళ.. తానేసిన రెండో ఓవర్‌లోనే హనుమ విహారి అలవోకగా ఆ వికెట్ పడగొట్టాడు. అడిలైడ్ టెస్టులో రోహిత్ శర్మ గాయపడటంతో.. అతని స్థానంలో హనుమ విహారి జట్టులోకి వచ్చిన విషయం తెలిసిందే. మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేస్తుండగా.. ఓపెనర్లు హారిస్ , అరోన్ ఫించ్ (50: 105 బంతుల్లో 6x4) తొలి వికెట్‌కి 112 పరుగుల భాగస్వామ్యంతో ఆ జట్టుకి శుభారంభమిచ్చారు. వీరిద్దరూ ఔటవడంతో.. జట్టు స్కోరు 134 వద్ద క్రీజులోకి వచ్చిన హ్యాండ్స్‌కబ్ ఒకింత ఒత్తిడిలోనే బ్యాటింగ్‌ని కొనసాగించాడు. దీన్ని పసిగట్టిన భారత్ ఫాస్ట్ బౌలర్లు.. పదే పదే బౌన్సర్లు విసురుతూ అతడ్ని పరీక్షించగా.. ఎట్టకేలకి ఇషాంత్ శర్మ ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా విసిరిన బంతికి అతను దొరికిపోయాడు. దీంతో.. 69 ఓవర్లు ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 201/4తో నిలిచింది. పెర్త్ పిచ్ ఎక్కువగా పేస్, బౌన్స్‌కి అనుకూలిస్తుండటంతో.. నలుగురు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగాలనుకున్న టీమిండియా.. ఒక స్పిన్ ఆల్‌రౌండర్‌ని కూడా టీమ్‌లో చేర్చాలనుకుంది. ఈ క్రమంలో సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా నుంచి పోటీ ఏర్పడినా.. హనుమ విహారీపై నమ్మకంతో కోహ్లీ తుది జట్టులో చోటిచ్చాడు. ఇంగ్లాండ్‌తో గత ఆగస్టులో ఆడిన తొలి టెస్టులోనే అర్ధశతకం బాదిన హనుమ విహారి, మూడు వికెట్లు కూడా తీశాడు
స్టన్నింగ్ క్యాచ్ పట్టుకున్న కోహ్లీ
ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుత ఫీల్డింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇన్నింగ్స్ 55వ ఓవర్ వేసిన ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో ఆస్ట్రేలియా మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ పీటర్ హ్యాండ్స్‌కబ్ (7: 16 బంతుల్లో) బంతిని థర్డ్ మ్యాన్ దిశగా హిట్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ.. బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి స్లిప్‌లోకి దూసుకెళ్లగా.. మెరుపు వేగంతో స్పందించిన విరాట్ కోహ్లీ కుడివైపు గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో క్యాచ్‌గా అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేస్తుండగా.. ఓపెనర్లు హారిస్ (70: 141 బంతుల్లో 10x4), అరోన్ ఫించ్ (50: 105 బంతుల్లో 6x4) తొలి వికెట్‌కి 112 పరుగుల భాగస్వామ్యంతో ఆ జట్టుకి శుభారంభమిచ్చారు. వీరిద్దరూ ఔటవడంతో.. జట్టు స్కోరు 134 వద్ద క్రీజులోకి వచ్చిన హ్యాండ్స్‌కబ్ ఒకింత ఒత్తిడిలోనే బ్యాటింగ్‌ని కొనసాగించాడు. దీన్ని పసిగట్టిన భారత్ ఫాస్ట్ బౌలర్లు.. పదే పదే బౌన్సర్లు విసురుతూ అతడ్ని పరీక్షించగా.. ఎట్టకేలకి ఇషాంత్ శర్మ ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా విసిరిన బంతికి అతను దొరికిపోయాడు. దీంతో.. 54.1 ఓవర్లు ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 148/4తో నిలిచింది.