YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మోడీ ప్రకటన ఖర్చు 5,200 కోట్లు

మోడీ ప్రకటన ఖర్చు 5,200 కోట్లు
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కారు గత నాలుగన్నరేళ్లలో ప్రకటనల కోసం చేసిన ఖర్చు ఎంతో తెలుసా? అక్షరాలా రూ.5200 కోట్లు. టీవీలు, పత్రికలు, ఇతర మాధ్యమాల్లో ప్రకటనలు గుప్పించడానికి 2014-15 నుంచి కేంద్రం భారీగా ఖర్చు పెట్టింది. గురువారం లోక్‌సభలో సమాచార ప్రసార శాఖ మంత్రి రాజ్యవర్థన్ రాథోడ్ ఈ విషయాన్ని వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది ప్రకటనల కోసం రూ.979.80 కోట్లు ఖర్చు చేసిన మోదీ సర్కారు.. ఏడాది ఏడాదికి ఆ వ్యయాన్ని పెంచుకుంటూ పోయింది. 2015-16 లో రూ.1160.16 కోట్లు, 2016-17లో రూ. 1264.26 కోట్లు, 2017-18లో రూ.1313.57 కోట్లను ఖర్చు పెట్టింది. 2018-19లో డిసెంబర్ 7 వరకు రూ.527.96 కోట్లను ప్రచారం కోసం వెచ్చించింది. పత్రికల్లో ప్రకటనల కోసం ఇప్పటి వరకూ రూ.2282 కోట్లు ఖర్చు చేసిన కేంద్రం.. వీడియోల రూపంలో ప్రకటనల కోసం రూ.2312.59 కోట్లు వెచ్చించింది. ఔట్‌డోర్ పబ్లిసిటీ కోసం రూ.651.14 కోట్లు గుమ్మరించింది. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి దాదాపు ఐదేళ్లలో రూ.5200 కోట్లు ఖర్చు పెట్టడం పెద్ద విషయమేం కాదు అనుకుంటున్నారా..? యూపీఏ ప్రభుత్వం అంతకు ముందు పదేళ్లలో పబ్లిసిటీ కోసం చేసిన ఖర్చు రూ. 2658.24 కోట్లు.

Related Posts