YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

గెహ్లోట్, కమల్ నాథ్ ల పేరు ఖరారు

గెహ్లోట్, కమల్ నాథ్ ల పేరు ఖరారు
మధ్యప్రదేశ్ సీఎంగా కమల్నాథ్ ను  ఎంపిక చేసిన కాంగ్రెస్ అధిష్టానం, తరువాత రాజస్థాన్ సీఎంగా అశోక్ గెహ్లాట్ ను ఎంపిక చేసింది. సీఎం పదవి కోసం చివరి వరకూ రేసులో ఉన్న సచిన్ పైలెట్ ను డిప్యూటీ సీఎం పదవికి ఎంపిక చేశారు. వాస్తవానికి మెజార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిగా సచిన్ పైలెట్ అభ్యర్థిత్వం పట్ల సుముఖంగా ఉన్నారు. కానీ సీనియర్లకు ప్రాధాన్యం ఇవ్వాలన్న అధిష్టానం నిర్ణయంతో ముఖ్యమంత్రి పీఠం గెహ్లాట్ నే  వరించింది. యువనేత జ్యోతిరాదిత్య సింధియా కూడా సీఎం కూర్చిని ఆశించినప్పటికీ సీనియర్ నేత కమల్నాథ్ నే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్గాంధీ ఎంపిక చేశారు. కమల్నాథ్ను సీఎంగా నిర్ణయించినట్లు  తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించింది. మధ్యప్రదేశ్ లో  230 స్థానాలుండగా కాంగ్రెస్ 114 చోట్ల, బీజేపీ 109, బీఎస్పీ 2, సమాజ్వాదీ పార్టీ 1, ఇతరులు 4 చోట్ల విజయం సాధించారు. బీఎస్పీ, ఎస్పీ, ఇండిపెండెంట్లు మద్దతు ఇవ్వడంతో.. ఆ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సన్నద్దమైంది.
అశోక్ గెహ్లాట్ ను  సీఎంగా, సచిన్ పైలెట్ ను  డిప్యూటీ సీఎంగా ఎన్నుకున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. రాజస్థాన్ సీఎం అంటూ గెహ్లాట్ ఫొటోను ట్వీట్ చేసింది. గెహ్లాట్ గతంలో రెండుసార్లు రాజస్థాన్ సీఎంగా పని చేశారు.  మొత్తానికి సీఎం పీఠం కోసం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్, యువనేత సచిన్ పైలట్ హోరాహోరి పోటీలో ఉన్నారు. ఇప్పటికే రెండుసార్లు ముఖ్యమంత్రిగా సేవలందించిన గెహ్లాట్ మూడోసారి అవకాశం కోసం ఎదురు చూస్తుండగా పీసీసీ చీఫ్ గా  ఉండి పార్టీని విజయపథంలో నడిపించిన పైలట్ కూడా ఆ రేసులో ముందున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో మంతనాల నడిపి ఎట్టకేలకు ఏఐసీసీ అశోక్ గెహ్లాట్ వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. సచిన్ పైలట్ పే డిప్యూటీ సీఎం చేసి ప్రస్తుతమున్న కాంగ్రెస్ చీఫ్ పదవిలో కూడా కొనసాగాలని సచిన్ పైలట్ కు  కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సూచించినట్లు సమాచారం. 
గెహ్లాట్, సచిన్ పైలెట్ ఇద్దరూ రాజస్థాన్ లో  బలమైన నేతలు. రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న పైలెట్.. పార్టీ విజయం కోసం అహర్నిశలు శ్రమించారు. సామాజిక వర్గాల పరంగా చూసుకున్నా.. సచిన్ పైలెట్ చివరి వరకూ గట్టిపోటీ ఇచ్చారు. గాంధీ కుటంబానికి దగ్గరి వ్యక్తయిన అశోక్ గెహ్లాట్ మాలి సామాజిక వర్గానికి చెందిన వారు. రాజస్థాన్ లో  వీరి ప్రాబల్యం ఎక్కువే. సచిన్ పైలట్ గుజ్జర్ సామాజిక వర్గానికి చెందిన యువ నేత. దీంతో గుజ్జర్ల ఓటు బ్యాంకును కాపాడుకోవడం కోసం సచిన్ పైలెట్ ను  డిప్యూటీ సీఎంగా ఎంపిక చేశారు

Related Posts