YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కష్టాల్లో 108 సిబ్బంది

కష్టాల్లో 108 సిబ్బంది

అత్యవసర పరిస్థితుల్లో రోగులను ఆదుకునే 108 సిబ్బంది కష్టాల్లో పడ్డారు. వాహనాల డీజిల్, మరమ్మతులకు సిబ్బందికి రావాల్సిన బకాయిలపై సందిగ్దత నెలకొంది. రాష్టవ్యాప్తంగా 10 ఏళ్లుగా జీవీకే సంస్థ అంబులెన్స్‌ల నిర్వహణను చూస్తోంది. తాజాగా ప్రభుత్వం ఆ బాధ్యతను భారత్ వికాస్ గ్రూప్ (జీవీబీ)కి అప్పగించింది.నెల్లూరు జిల్లాలో దాదాపు 36 లక్షల జీతభత్యాల బకాయిలున్నాయి. వాహనాల డీజిల్, మరమ్మతులు, సిబ్బంది జీతభత్యాల బకాయిల చెల్లింపులో కొత్త సంస్థకు ఎలాంటి బాధ్యత లేదు. జీవీకే సంస్థ, ప్రభుత్వమే ఆ బకాయిలను చెల్లించాలి. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టతా రాలేదు. దాంతో జిల్లాలో 108 ఉద్యోగులు ఆందోళనలో చెందుతున్నారు.ప్రస్తుతం జిల్లాలో అంబులెన్స్ వాహనాలు 26 ఉన్నాయి. వాటిలో 24 వరకూ రోగులకు వైద్య సేవలందిస్తున్నాయి. ఈ వాహనాల మరమ్మతులు బకాయిలు నాలుగు లక్షల దాకా ఉన్నాయి. పెట్రోల్ బంకు యజమానులకు డీజిల్ బకాయిలు మరో నాలులు లక్షల వరకు పేరుకుపోయాయి. వాటి కోసం అధికారులపై యజమానులు ఒత్తిడి తెస్తున్నారు. చెల్లించకపోతే డిజిల్ పోయలేమంటూ తేల్చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 126 మంది ఉద్యోగులు అంబులెన్స్ లలో పనిచేస్తున్నారు. వారికి నవంబర్ జీతాలు దాదాపు రూ.15లక్షల వరకూ చెల్లించాలి. మొదటివారంలోనే చెల్లించాల్సి ఉన్నా ఇంకా ఇవ్వలేదు. తాజాగా జీవీబీ సంస్థకు బాధ్యతలు అప్పగించడతో ఈ చెల్లింపుల్లో మరింత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది.  చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం హామీ ఇవ్వకపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. దీనికి తోడు 108 కార్యాలయాలు శిథిలావస్థకు చేరుకున్నాయి.ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి బకాయిల చెల్లింపుతో పాటు నూతన కార్యాలయాలు నిర్మించాలని ఉద్యోగులు కోరుకుంటున్నారు..

Related Posts