పాలిటిక్స్‌లో కావాల్సింది.. ప్రజల అభిమానం సంపాదించడం. ప్రజల్లో మంచి పరపతి పొందడం. ఎక్కడ నుంచి ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారనే విషయం కన్నా.. ఆ నాయకుడు ఎక్కడ నుంచి పోటీ చేసినా.. విజయం సాధిస్తాడు. అని చెప్పుకొనే రీతిలో నలుగురు నాయకులు ఏపీలో ఉన్నారు. అయితే, వీరంతా ఇప్పుడు పార్టీలకు దూరంగా .. వివిధ కార ణాలతో ఆయా పార్టీలకు రాజీనామాలు సమర్పించి.. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే, ప్రజలపైనా.. ప్రస్తుత రాజకీయాల ట్రెండ్‌పైనా మాత్రం వారి ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. గత ఎన్నికలకు దూరంగా ఉన్నవారు కూడా ఈ నలుగురిలో ఉన్నారు.అయితే, ఈ నలుగురు .. ప్రజల్లో ఎక్కడ నుంచి పోటీ చేసినా దాదాపు గెలిచే స్వభావం ఉన్న నాయకులుగా నిజాయితీ పరులుగా పేరు తెచ్చుకున్నారు. ఇక, వీరు వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధపడుతున్నారు. కానీ, ఏ పార్టీ తరఫున? అనేది మాత్రం ఇప్పుడు చర్చకు వస్తున్న ప్రధాన విషయం. పోనీ.. పార్టీలను పక్కన పెడితే.. సొంతంగా ఏమన్నా ట్రై చేస్తున్నారా? అంటే.. అది లేదు. సో.. వీరు ఏదో ఒక పార్టీలో అయితే చేరి తీరాల్సిందే. ఇప్పుడు ఈ పరిణామమే హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆ నలుగురు ఎవరంటే.. అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బం హరి, రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, ఉత్తరాంధ్రకు చెందిన కొణతాల రామకృష్ణ, తాజాగా కాంగ్రెస్‌కు రిజైన్ చేసిన మాజీ మంత్రి వట్టి వసంత కుమార్.ఈ నలుగురికి ప్రజల్లో మంచి పలుకుబడి ఉండడంతోపాటు అవినీతి ఆరోపణలు లేని నాయకులుగా కూడా గుర్తింపు సాధించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఉండవల్లి పైకి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని చెబుతున్నా.. ఆయన అనుచరులు మాత్రం ఖచ్చితంగా ఆయన పోటీకి సిద్ధమవుతారనే అంటున్నారు. ఈ నేపథ్యంలో వీరిని తమ పార్టీలోకి తీసుకునేందుకు జనసేన, వైసీపీ కూడా ప్రయత్నిస్తున్నాయి.ఇక, సబ్బం హరి కోసం టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. ఆయన కోసం ఇప్పటికే విశాఖలో ఓ ఎమ్మెల్యే సీటును ఖాళీగా ఉంచారనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అలాగే అనకాపల్లి లేదా విశాఖపట్నం ఎంపీ సీట్ల కోసం కూడా ఆయన పేరు టీడీపీ పరిశీలిస్తోంది.అడపాదడపా మీడియా ముందుకువస్తున్న సబ్బం.. టీడీపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక, కొణతాల కూడా పార్టీలు చూసుకుంటున్నారనే ప్రచారం ఉంది. వట్టి విషయం తెలసిందే. ఆయనకు టచ్‌లో వైసీపీ, జనసేనలు ఉన్నాయి. మొత్తంగా ఈ నలుగురు కోసం మూడు పార్టీలు రెడ్ కార్పెట్‌ను పరిచే ఉంచాయని అంటున్నారు. అయితే, ఈ నేతల పల్స్ మాత్రం ప్రధాన పార్టీలు పట్టుకోలేకపోతుండడమే ఇక్కడ చర్చకు తావిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి