YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మేనల్లుడి భౌతికకాయానికి నివాళులర్పించిన సీఎం చంద్రబాబు

మేనల్లుడి భౌతికకాయానికి నివాళులర్పించిన సీఎం చంద్రబాబు

చిత్తూరు జిల్లాలోని కందులవారిపల్లిలో మేనల్లుడు ఉదయ్ కుమార్ భౌతిక కాయానికి సీఎం చంద్రబాబు నివాళులుర్పించారు. శనివారం ఉదయం 11 గంటలకు నారావారి పల్లె సమీపంలో కందులవారి పల్లె చేరుకుని తన సోదరి హైమవతి కుటుంబాన్ని అయన పరామర్శించారు. అయన వెంట సతీమణి నారా భువనేశ్వరి, కొడుకు నారా లోకేష్,  కోడలు నారా బ్రాహ్మిణి, మంత్రి అమరనాథ్ రెడ్డి,  చిత్తూరు పార్లమెంట్ సభ్యులు ఎన్. శివప్రసాద్, శాసన సభ్యులు సత్యప్రభ, శంకర్ యాదవ్,తలారి ఆదిత్య,  కలెక్టర్ ప్రద్యుమ్న, ప్రజాప్రతినిధులు నరసింహ యాదవ్, శ్రీధర్ వర్మ, గాలి భానుప్రకాష్, నాని, సినీ నిర్మాత శేషగిరిరావు, సినీ హీరో నారా రోహిత్, నారా ఇందిర, స్థానికులు, తదితరులు వున్నారు. అంతకుముందు అయనకు రేణిగుంట విమానాశ్రయంలో మంత్రి ఎన్. అమరనాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న, డిఐజి టి.కె.రాణా, ఎస్పీడిసిఎల్ సిఎండి ఎం.ఎం. నాయక్, తిరుపతి మునిసిపల్ కమీషనర్ విజయరామరాజు,  అర్బన్ ఎస్పీ అన్బు రాజన్, సబ్ కలెక్టర్ మహేష్ కుమార్ నిరాడంబరంగా స్వాగతం పలికారు. అంత్యక్రియాల్లో పాల్గోన్న చంద్రబాబు  మధ్యాహ్నం తిరిగి రాజధానికి బయలుదేరి వెళ్లారు.

Related Posts