YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

సినిమా

వెంకటేశ్ సరసన శ్రియ..?

వెంకటేశ్ సరసన శ్రియ..?

-  18నుంచి 'ఆట నాదే వేటా నాదే'

వెంకటేశ్, తేజ దర్శకత్వంలో ఒక చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ నెల 18నుంచి సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ సినిమా కోసం 'ఆట నాదే వేటా నాదే' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో వెంకటేశ్ సరసన హీరోయిన్‌గా తాజాగా శ్రియ పేరు వినిపిస్తోంది.

గతంలో కాజల్ అగర్వాల్, రితికా సింగ్ తదితరుల పేర్లు వినిపించగా.. ఎవరినీ అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఇటీవల ఈ కథను శ్రియకు వినిపించగా.. ఇందులో నటించేందుకు ఆమె ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. కాగా శ్రియ, వెంకటేశ్‌ కాంబినేషన్‌లో ఇప్పటికే 'సుభాష్ చంద్రబోస్', 'గోపాల గోపాల' సినిమాలు వచ్చాయి. 

Related Posts