YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రఫేల్‌ ఒప్పంద ఫై సుప్రీంకోర్టును అబద్ధాలు చెప్పి తప్పుదోవ పట్టించిన ప్రభుత్వం పీఏసీ కాంగ్రెస్‌ నేత మల్లికార్జున ఖర్గే

రఫేల్‌ ఒప్పంద ఫై సుప్రీంకోర్టును అబద్ధాలు చెప్పి తప్పుదోవ పట్టించిన ప్రభుత్వం           పీఏసీ కాంగ్రెస్‌ నేత మల్లికార్జున ఖర్గే

 రఫేల్‌ ఒప్పంద విషయంలో ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అబద్ధాలు చెప్పి తప్పుదోవ పట్టించిందని పీఏసీ అధ్యక్షుడు, కాంగ్రెస్‌ నేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. అటార్నీ జనరల్‌, కాగ్‌కు సమన్లు పంపించే విషయంపై పార్లమెంటులోని ప్రజాపద్దుల కమిటీ సభ్యులతో చర్చిస్తానని ఖర్గే శనివారం తెలిపారు. కాగ్‌ ద్వారా తప్పుడు వివరాలను సుప్రీంకోర్టుకు ఇచ్చినందుకుగాను ప్రభుత్వం క్షమాపణలు చెప్పాల్సిందిగా ఆయన డిమాండ్‌ చేశారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తామని కానీ రఫేల్‌ ఒప్పందంపై తప్పనిసరిగా సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) వేయాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.‘పార్లమెంటులో కాగ్‌ ఇచ్చిన నివేదికను ఎప్పుడు ప్రవేశపెట్టారనే దానిపై అటార్నీ జనరల్‌, కాగ్‌ సమాధానం ఇవ్వాలి. ఈ మేరకు పీఏసీ సభ్యులతో మాట్లాడి వారికి సమన్లు పంపిస్తాం’ అని ఖర్గే తెలిపారు. ‘కాగ్‌ ఇచ్చిన నివేదికను పీఏసీ ఎప్పుడు పరిశీలించింది. ఆ నివేదికను పార్లమెంటు ఎదుట ఎప్పుడు ఉంచారు. సుప్రీంకోర్టుకు ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇవ్వడం చూసి షాక్‌కు గురయ్యాం. సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించినందుకు గాను ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలి’ అని ఆయన డిమాండ్‌ చేశారు. కాగ్‌ ఇచ్చిన నివేదికను పీఏసీ పరిశీలించిందని వివరించింది. కాగ్‌ నివేదికలో ఎడిట్‌ చేసిన ఒక భాగాన్ని మాత్రమే పార్లమెంటు ముందుంచారని పేర్కొంది. అయితే.. పీఏసీకి ఇప్పటి వరకూ కాగ్‌ నివేదికే అందలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.ధరల వివరాలను కాగ్‌కు అందజేశారని ప్రభుత్వం న్యాయస్థానానికి తెలిపినట్లు నిన్న వెలువరించిన తీర్పులో సుప్రీంకోర్టు ప్రస్తావించిన విషయం తెలిసిందే. 

Related Posts