YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

నిక్యాంక పెళ్లిపై నెటిజన్లు ఇంట్రెస్ట్

 నిక్యాంక పెళ్లిపై నెటిజన్లు ఇంట్రెస్ట్

2018 చివరి రోజుల్లో ఉన్నాం. ఈ ఏడాది పలు ఆసక్తికర అంశాలకు వేదికైంది. అనేక శుభకార్యాలూ జరిగాయి. వివిధ  వండర్స్ సైతం అలరించాయి. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్న ఇష్యూస్ కూడా ఉన్నాయి. వీటిలో రెండో స్థానంలో గ్లోబల్ యాక్ట్రస్ ప్రియాంక చోప్రా వివాహమహోత్సవం కూడా ఉంది. 2018లో ప్రజలు అత్యధికంగా ఆస్తకి చూపిన అంశాలను గూగుల్ లేటెస్ట్ గా వెల్లడించింది. వాటిలో ఈ సంవత్సరం జరిగిన సెలబ్రిటీ మ్యారేజస్ ఉన్నాయి. సెలబ్రిటీల పెళ్లిళ్లపై నెటిజన్లు చాలా ఇంట్రెస్ట్ చూపారు. గూగుల్‌లో ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించి, మొదటి స్థానంలో నిలిచింది మాత్రం బ్రిటన్ రాయల్ ఫ్యామిలీ వివాహ వేడుకే. బ్రిటన్ రాణి ఎలిజబెత్ మనవడు ప్రిన్స్‌ హ్యారీ, ప్రముఖ హాలీవుడ్ నటి మేగాన్ మెర్కెల్ వివాహంపై నెటిజన్లు చాలా ఆసక్తి చూపారు. వీరి పెళ్లి వేడుక తరవాత ఎక్కువ మందిని ఆకట్టుకుంది మాత్రం ప్రియాంక, నిక్‌ వివాహే. వీరిద్దరు రాజస్థాన్‌లోని జుమైద్‌భవన్‌లో డిసెంబరు 1,2 తేదీల్లో క్రిస్టియన్, హిందూ సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్నారు. అంగరంగ వైభవంగా సాగిన ఈ వేడుక భారత్ లోనే కాక అమెరికాలోనూ హాట్ టాపిక్ అయింది. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్న వివాహ వేడుకల జాబితాలో బాలీవుడ్ అందాల జంట రణ్‌వీర్‌ సింగ్, దీపిక పదుకొణె కూడా ఉన్నారు. వీరి వివాహానికి ఐదో స్థానం దక్కింది. వీరు నవంబరు 14,15 తేదీల్లో ఇటలీలోని లేక్‌కోమో వద్ద అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు.

Related Posts