నాలుగు రోజుల క్రితం అల్పపీడన రూపంలో బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెథాయ్, ఇప్పుడు తిత్లీని మించిన ఆందోళనను కలిగిస్తోంది. ఇప్పటికే పెను తుఫానుగా మారిన పెథాయ్, తీరంవైపు గంటకు 17 కిలోమీటర్ల వేగంతూ దూసుకొస్తోంది. రేపు కాకినాడ, మచిలీపట్నం మధ్య తుఫాను తీరాన్ని దాటవచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరిస్తున్నారు.