YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

పన్ను ఎగవేసిన పాప్ సింగర్..!!

పన్ను ఎగవేసిన పాప్ సింగర్..!!

 పాప్ సింగర్ షకీరాపై కేసు నమోదైంది. 14.5 మిలియన్ యూరోల (రూ.118 కోట్లు) పన్నును ఎగవేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న షకీరాపై తాజాగా స్పెయిన్‌లో అభియోగాలు నమోదయ్యాయి. షకీరా 2015లో తన నివాసాన్ని బహమాస్ నుంచి బార్సెలోనాకు మార్చింది. అక్కడామె తన భాగస్వామి, బార్సెలోనా ఫుట్‌బాల్ ఆటగాడు గెరార్డ్ పిక్‌తో కలిసి నివసిస్తోంది. వీరికి ఇద్దరు కుమారులున్నారు.షకీరా పన్ను ఎగవేత ఆరోపణలపై 11 నెలల క్రితమే న్యాయాధికారులు దర్యాప్తుకు ఆదేశించారు. తాజాగా అభియోగాలు నమోదయ్యాయి.

Related Posts