అమెరికాలోని డల్లాస్ లో ఈ రోజు జరిగిన ‘జనసేన ప్రవాస గర్జన’ సభలో తెలుగువారిని ఉద్దేశించి జనసేనాని మాట్లాడారు. ప్రపంచాన్ని మార్చాలన్న ఆశయానికి ముందు మనం మారాలని కోరుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. తాను 2019లో ఏపీ ముఖ్యమంత్రిని అవుతానో, లేదో భగవంతుడి చేతిలో ఉందని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఆంధ్రాలో వేలకోట్లు ఆస్తులు ఉన్నప్పటికీ కొందరు నేతలకు ఇంకా డబ్బుపై ఆశ చావలేదని విమర్శించారు. అందువల్లే అవినీతి విలయతాండవం చేస్తోందని చెప్పారు. తాను విశ్వనరుడిని అని వ్యాఖ్యానించారు. తాను ఏ ఒక్క రాష్ట్రం కోసం పనిచేయననీ, దేశం కోసం పనిచేస్తానని తెలిపారు. యువత జీవితం, భవిష్యత్ నాశనమైపోతుంటే చూస్తూ ఊరుకోబోనని స్పష్టం చేశారు.