తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ సేన 283 పరుగులకే ఆలౌటైంది. మూడోరోజు, ఆదివారం ఆట ముగిసే సరికి కంగారూ జట్టు 4 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. ఆధిక్యంతో కలుపుకొని 175తో ఉంది. ఓవర్‌నైట్ స్కోరు 172/3తో టీమిండియా మూడో రోజు ఆట ఆరంభించింది. 82 పరుగులతో బ్యాటింగ్‌కు దిగిన విరాట్ కోహ్లీ (123; 257 బంతుల్లో 13×4, 1×6) అద్భుత శతకం బాదేశాడు. ముందు రోజు చెలరేగి ఆడిన వైస్ కెప్టెన్ అజింక్య రహానె (51; 105 బంతుల్లో 6×4, 1×6) కేవలం రెండు బంతులు ఎదుర్కొని పెవిలియన్ చేరాడు. మూడో రోజు మొత్తంమీద భారత్ 111 పరుగులు మాత్రమే చేసింది. 283 వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టుకు శుభారంభం దక్కింది. 43 పరుగుల ఆధిక్యం ఉండటంతో బ్యాట్స్‌మెన్ నిలకడగా ఆడారు. ఆట ముగిసే సరికి ఆ జట్టు 4 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. 175 పరుగుల ఆధిక్యంతో ఉంది.