పెథాయ్ తుపాను శరవేగంగా తీరం వైపు దూసుకొస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి ఏటా మనకు తుపాన్లు రావడం సహజమేనని.. ఈ ఏడాది గత రెండు తుపాన్లపై ముందుగానే అంచనా వేశామని... గతంలో జరిగిన పొరపాట్లకు మళ్లీ తావివ్వద్దని అధికారులకు సూచించారు. విద్యుత్, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. బాధితులకు నీటి ప్యాకెట్లు, ఆహారం అందజేయాలని చెప్పారు. ప్రతి గ్రామానికి ఒక ఫోర్స్ ను సిద్ధం చేయాలని ఆదేశించారు.