YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కాకినాడకు 125 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన తీవ్ర తుపాన్

 కాకినాడకు 125 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన తీవ్ర తుపాన్
సోమవారం ఉదయం తూర్పుగోదారి, పచ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుననయి. తూర్పు గోదావరి, పచ్చిమ గోదావరి జిల్లాల్లో బలమైన ఈదురు గాలులు గంటకు 110 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.  ప్రజలు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని అధికార యంత్రాంగం హెచ్చరించింది. అరటి రైతులు, ఉద్యానవన రైతులు జాగ్రత్తల్లో ఉండాలి. వరి, జొన్న, తదితర ధాన్యాలను కోసినవారు వాటిని తక్షణం గోదాముల్లో భద్రపరచాలి.  పొలాల్లోనే ఇంకా ధాన్యం ఉంటే దానిపైన టార్పాలిన్ పట్టలు కప్పి భధ్రపరచాలని సూచించారు.  గుడిసెల్లో, రేకుల షెడ్డుల్లో ఉన్న నివాసముంటున్న వారిని వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించాలి. లోతట్టు ప్రాంత ప్రజలను తక్షణం సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని పూచించారు. తుపాన్ తీరం దాటే వరకు ప్రజలు ఎవరూ కూడా ఇళ్ల నుంచి బయటకు రాకూడదు. రోడ్లపై వాహనాల్లో తిరగరాదు, చెట్ల కింద తలదాచుకోరాదు. తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ప్రజలు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. 

Related Posts