పెథీ తుపాన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాల కలెక్టర్లు, నోడల్ అధికారులు,సిబ్బంది పాల్గోన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇది అత్యవసర పరిస్థితిగా భావించాలి. తుపాన్ ప్రభావిత జిల్లాలలో రెడ్ అలర్ట్ ప్రకటించాలి. దానికి తగ్గట్లుగా పనిచేయాలి. విపత్తులలో ఎవరూ సెలవులు పెట్టరాదు. అందరూ విధులకు హాజరు కావాలి. అప్పగించిన బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు. విపత్తును ఎదుర్కోవడంపై ప్రతిశాఖకు యాక్షన్ ప్లాన్ లు. ప్రణాళికకు అనుగుణంగా పనిచేయాలి. మన రాష్ట్రంలో విపత్తులు ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా తుపాన్లు వస్తాయి. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు తుపాన్ల కాలం. ప్రతి జిల్లాలో ఎమర్జెన్సీ మేనేజిమెంట్ ప్లాన్ లు సిద్ధం చేయాలని అన్నారు. పెథీ తుపాన్ కాకినాడకు దక్షిణంగా 200కి.మీ దూరంలో కేంద్రీకృతం అయ్యింది. 20కి.మీ వేగంతో తీరంవైపు దూసుకు వస్తోంది. తీరాన్ని తాకగానే 100-110కి.మీ వేగంతో ఈదురుగాలులు వీసే అవకాశం ఉంది. యానాం-తుని మధ్య తీరాన్ని తాకుతుందని అంచనా. తూర్పుగోదావరి,పశ్చిమ గోదావరి,విశాఖ,విజయనగరం,శ్రీకాకుళంలో భారీ వర్షాలు పడతాయి. జన నష్టం,పశునష్టం నివారించాలి. ప్రజల ఇబ్బందులను తగ్గించాలి. అన్నివర్గాల ప్రజల్లో విశ్వాసం కల్పించాలి. మేము ఉన్నామనే భరోసా ఇవ్వాలి. అన్ని వనరులను,మేన్ పవర్ సిద్ధం చేసుకోవాలని అన్ఆరు. ప్రతి గ్రామానికి స్పెషల్ ఆఫీసర్ బాధ్యత తీసుకోవాలి. గ్రామంలో అందరినీ చైతన్యపరచాలి. సహాయ చర్యలలో ‘ఆపద మిత్ర’లు భాగస్వాములు కావాలని సూచించారు. ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. పునరావాస కేంద్రాలలో అన్ని వసతులు కల్పించాలి. అల్పాహారం, భోజనం, తాగునీరు అందించాలి. పాలు, కూరగాయలతో సహా నిత్యావసరాలను సిద్ధంగా ఉంచాలి. మీ పనితీరే ప్రామాణికం. ప్రభుత్వానికి ఎక్కడా చెడ్డపేరు రాకూడదు. సాధ్యమైన త్వరగా సాధారణ స్థితి తేవాలని అన్నారు. ప్రతి గంటకు బులెటిన్ విడుదల చేయాలి. ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలి. ఈ సాయంత్రానికే నేను విశాఖకు చేరుకుంటాను. మంత్రులు అందరూ మధ్యాహ్నానికే మండలాలకు చేరాలి. సహాయ చర్యలలో పార్టీ నేతలు,కార్యకర్తలు చురుగ్గా పాల్గొనాలి. సహాయ పునరావాస చర్యలు మనందరి బాధ్యత. కేవలం ప్రభుత్వమే కాదు. అన్నివర్గాల ప్రజలు చేయూత అందించాలి. కూలిన చెట్లను వెంటనే తొలగించాలి. విద్యుత్ స్థంభాలను వెంటనే పునరుద్దరించాలి. పునరావాస చర్యలలో అందరూ భాగస్వాములు కావాలని అన్నారు. మన అసమర్ధతతో ప్రజలు ఇబ్బందులు పడరాదు.బాధ్యతా రాహిత్యాన్ని సహించేది లేదు. ఎస్ డిఆర్ ఎఫ్,ఎన్ డిఆర్ ఎఫ్ బృందాలు పొజిషన్ కావాలి.అవసరమైతే హెలికాప్టర్లు సిద్దంగా ఉంచాలి. విద్యుత్,ట్రాఫిక్ వెంటనే పునరుద్ధరించాలి. 24గంటల్లో సాధారణ స్థితి రావాలి. తాగునీటి పథకాల వద్ద జనరేటర్లు,ట్యాంకర్లు సిద్ధం చేయాలి. పోల్ డ్రిల్లింగ్ మిషన్లు అందుబాటులో ఉంచాలి. టార్పాలిన్ పట్టాలు సిద్ధంగా ఉంచుకోవాలి.ధాన్యం సేకరణ కేంద్రాలు,వరి కల్లాల వద్ద టార్పాలిన్లు ఉంచాలి. ఎంతమందిని సమీకరించాలి..?ఏయే వనరులు సిద్దం చేసుకోవాలి..? అనేదానిపై కార్యాచరణ రూపొందించాలి ఎంత వేగంతో గాలులు వీస్తాయి, ఎన్ని చెట్లు పడిపోతాయి, ఎన్ని విద్యుత్ స్థంభాలు విరిగిపడతాయి అన్నదానిపై ముందే అవగాహన ఉండాలి.దానికి తగ్గట్లుగా అన్నింటినీ సిద్ధం చేసుకోవాలని అన్నారు. ఎంత బాగా చేశామనే కాదు,ఎంత సమర్ధంగా చేశామనేదే ముఖ్యం. నష్టాన్ని ఎంత తక్కువకు నియంత్రించాం అన్నదే ప్రాధాన్యం అని అయన అన్నారు.