గత రెండు రోజుల నుండి జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం మచిలీపట్నం లో ఉండి తుఫాను పరిస్థితులు ను పర్యవేక్షిస్తున్నారు. కంట్రోల్ రూమ్ నుండి వివిధ శాఖల అధికారులను టెలి కాన్ఫరెన్స్ ద్వారా అప్రమత్తం చేస్తున్నారు. సోమవారం ఉదయం జిల్లాలో పునరావాస కేంద్రాలలో ఉదయం ఏడు గంటలకు 750 మందికి పునరావాస కేంద్రాలలో అల్పాహారం అందించారని అయన మీడియాతో తెలిపారు. అలాగే, జిల్లాలో అన్ని పాఠశాలలకు అంగన్వాడీ కేంద్రాలకు మంగళవారం సెలవు ప్రకటించారు. విజయవాడ క్రీస్తు రాజపురం లో కొండ చరియ విరిగి పడి మరణించిన వ్యక్తి కుటుంబానికి తక్షణ సహాయంగా 50 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గుడివాడ మచిలీపట్నం లలో మొబైల్ రైతు బజార్లను ఏర్పాటు చేయాలని కుడా అధికారులను ఆదేశించారు.