జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఒక మధ్యతరగతి కుటుంబం కొనుగోలు చేసే నిత్యావసర వస్తువుల ద్వారా సగటున రూ.320 ఆదా అవుతుంది. అంటే సంవత్సరానికి రూ. 3840 ఆదా అవుతందని ఆర్థికమంత్రిత్వశాఖ వర్గాలు వెల్లడించాయి. జీఎస్‌టీ అమలుకు ముందు తర్వాత పరిస్థితులను పరిశీలిస్తే, దాదాపు 83 వస్తువుల ధరలు తగ్గాయి. వీటిలో ఆహార ఉత్పత్తులతో పాటు, హెయిర్ ఆయిల్, టూత్‌పేస్ట్, సబ్బులు, వాషింగ్ పౌడర్, చెప్పుల ధరలు తగ్గాయి. ఒక సగటు మధ్యతరగతి కుటుంబం నెలకు రూ.8,400 ఖర్చు పెడుతుంటే, జీఎస్‌టీ తర్వాత తృణధాన్యాలు, ఆయిల్, పంచదార, చాక్లెట్‌లు, మిక్చర్, స్వీట్‌లు, సౌందర్య సాధనలు, వాషింగ్ పౌడర్, టైల్స్, ఫర్నీచర్ ఇలా గృహ వినియోగ ఉత్పత్తులపై దాదాపు రూ.320 తగ్గుతున్నట్లు వెల్లడైంది.