YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

బిడ్డకు పాలిచ్చిన ట్రాన్స్‌జెండర్!

బిడ్డకు పాలిచ్చిన ట్రాన్స్‌జెండర్!

 ప్రపంచంలో తొలిసారి జరిగిన వింత ఇది. 30 ఏళ్ల ఓ ట్రాన్స్‌జెండర్ మహిళ తన బిడ్డకు పాలిచ్చింది. ఎలాంటి లింగ మార్పిడి సర్జరీలు చేసుకోకుండానే ఆమె పాలివ్వడం గమనార్హం. ఇలాంటి సర్జరీల వల్ల సదరు వ్యక్తి శరీరంలో హార్మోన్ స్థాయిలో మార్పు రావడంతోపాటు చనుబాలను వృద్ధి చేస్తాయి. తన భాగస్వామి బిడ్డకు పాలివ్వడానికి నిరాకరించడంతో ఆమె మౌంట్ సినాయ్‌లోని సెంటర్ ఫర్ ట్రాన్స్‌జెండర్ మెడిసిన్ అండ్‌ సర్జరీలోని డాక్టర్లను ఆశ్రయించింది. వాళ్లు బిడ్డ పుట్టడానికి ముందు మూడు నెలల పాటు హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ చేశారు.

బిడ్డ పుట్టే సమయానికి ఆమెలో చనుబాల వృద్ధి కనిపించింది. మొదట ఆరు వారాల పాటు అలా పాలిచ్చిన ఆమె.. తర్వా ఆరు నెలలపాటు కొనసాగించింది. ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు ఇచ్చే మందులకు సంబంధించి ఇది చాలా పెద్ద పురోగతి అని ఆమెకు ట్రీట్‌మెంట్ ఇచ్చిన డాక్టర్ టామర్ రీస్మాన్ చెప్పారు. ఇప్పుడామె కేసును ట్రాన్స్‌జెండర్ హెల్త్ అనే జర్నల్‌లో పబ్లిష్ చేశారు. డూ ఇట్ యువర్‌సెల్ఫ్ హార్మోన్ థెరపీ ద్వారా ట్రాన్స్‌జెండర్ మహిళలు గర్భం దాల్చొచ్చు.. బిడ్డకు జన్మనివ్వొచ్చనడానికి ఈ కేసే నిదర్శనమని రీస్మాన్ అన్నారు.

Related Posts